LOADING...
Blue Origin: ప్రయోగ వేదికపైనే పేలిన రాకెట్‌.. ఎగిసిపడ్డ అగ్నిజ్వాలలు.. వీడియో వైరల్
ప్రయోగ వేదికపైనే పేలిన రాకెట్‌.. ఎగిసిపడ్డ అగ్నిజ్వాలలు.. వీడియో వైరల్

Blue Origin: ప్రయోగ వేదికపైనే పేలిన రాకెట్‌.. ఎగిసిపడ్డ అగ్నిజ్వాలలు.. వీడియో వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2026
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జెఫ్‌ బెజోస్‌కు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ బ్లూ ఆరిజిన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ నిర్వహించిన రాకెట్‌ పరీక్ష సమయంలో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. పరీక్షలో భాగంగా సిద్ధం చేసిన రాకెట్‌ ప్రయోగ వేదికపైనే ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపిస్తున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని కేప్‌ కెనావెరాల్‌లో గురువారం రాత్రి బ్లూ ఆరిజిన్‌ సంస్థ తన 'న్యూ గ్లెన్‌' రాకెట్‌కు హాట్‌ఫైర్‌ పరీక్ష నిర్వహించింది. పరీక్ష కొనసాగుతున్న సమయంలో రాకెట్‌ అకస్మాత్తుగా పేలిపోవడంతో ప్రయోగ వేదిక మొత్తం మంటల్లో చిక్కుకుంది. పేలుడు ధాటికి భారీ అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి.

వివరాలు 

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సంస్థ వెల్లడించింది. అయితే ప్రయోగ కేంద్రం పరిసర ప్రాంతాల్లో గణనీయమైన నష్టం జరిగినట్లు సమాచారం. పేలుడుకు దారితీసిన అసలు కారణాలను గుర్తించేందుకు అధికారులు, నిపుణులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ ఘటనపై జెఫ్‌ బెజోస్‌ స్పందిస్తూ, తమ సంస్థకు ఇది ఎంతో కఠినమైన రోజుగా పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఒక్కసారిగా పేలిన రాకెట్‌.. వైరల్‌గా మారిన దృశ్యాలు

Advertisement