One-ring: వన్-రింగ్ స్కామ్.. మిస్డ్ కాల్‌తో మీ డేటా ఎంతవరకు సురక్షితం?
సోషల్ మీడియాలో ఇటీవల ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో +371, +375, +381 వంటి అంతర్జాతీయ కోడ్‌లతో వచ్చే మిస్డ్ కాల్స్ ద్వారా వ్యక్తిగత, బ్యాంక్ వివరాలను చోరీ చేస్తారని, ఫోన్‌లో #90, #09 కోడ్లు ఎంటర్ చేస్తే SIM కార్డు వివరాలు క్లోన్ అవుతాయని హెచ్చరించారు. ఈ క్లెయిమ్ నిజమైనా? ఇప్పుడు దానిని పరిశీద్దాం. క్లెయిమ్ ఏమిటి? 1.అంతర్జాతీయ నంబర్ల నుంచి మిస్డ్ కాల్స్ ద్వారా వ్యక్తిగత సమాచారం దొంగిలించగలరని పేర్కొన్నారు. 2. ఫోన్‌లో #90, #09 కోడ్స్ డయల్ చేయడం వల్ల SIM కార్డ్ వివరాలను యాక్సెస్ చేయగలరని సూచించారు.
ఈ క్లెయిమ్‌లు ఎంతవరకు నిజం?
వన్-రింగ్ స్కామ్ ఈ స్కామ్‌లో స్కామర్లు రాండమ్ నంబర్లకు చిన్న మిస్డ్ కాల్స్ ఇస్తారు. బాధితులు తిరిగి కాల్ చేస్తే, ఖరీదైన అంతర్జాతీయ ప్రీమియం రేటు లైన్లకు మళ్లిస్తారు. ఫలితంగా, ఎక్కువ కాల్ చార్జీలు వసూలవుతాయి. ఈ చార్జీలలో కొంత భాగం స్కామర్లకు చేరుతుంది. SIM కార్డ్ క్లోన్ లేదా వివరాల దొంగతనం 90, #09 కోడ్లు : వీటిని సెల్‌ఫోన్లలో డయల్ చేయడం వల్ల ఎలాంటి SIM కార్డు వివరాలు యాక్సెస్ అవ్వవు. ఈ క్లెయిమ్ ఎటువంటి ఆధారాలు లేకుండా పాత టెలిఫోన్ PBX/PABX వ్యవస్థల స్కామ్‌లతో కలిపి వ్యాప్తి చేశారు.
మోసగాళ్ల భారీ నుండి ఎలా తప్పించుకోవాలంటే
1. అనుమానాస్పద అంతర్జాతీయ నంబర్లకు తిరిగి కాల్ చేయవద్దు. 2. ఫోన్ నంబర్లను అపరిచిత వ్యక్తులకు పంచుకోవద్దు. 3. బ్యాంకింగ్ లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్ ద్వారా ఎవరితోనూ పంచుకోవద్దు. 4. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండి, తప్పనిసరి చర్యలు తీసుకోండి. తదుపరి హెచ్చరికలు సైబర్ నేరగాళ్ల మోసపూరిత మార్గాల గురించి ప్రజలను అప్రమత్తం చేయడం అవసరం. ఏ అనుమానాస్పద కాల్‌లు వచ్చినా, అవి ముఖ్యమైనవా అని కనుక్కోకుండానే తిరిగి కాల్ చేయడం మానుకోవడం మంచిది.