ఇండియాలో వన్ ప్లస్ నార్డ్ CE3 5G అమ్మకాలు ఈరోజు నుండే ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో వన్ ప్లస్ నార్డ్ CE3 5G అమ్మకాలు ఈరోజు మొదలు కానున్నాయి.
8GB/128GB గల స్మార్ట్ ఫోన్ ధర 26,999రూపాయలుగా ఉంటే, 12GB/256GB మోడల్ ఖరీదు 28,999 రూపాయలుగా ఉంది.
అమెజాన్ లో ఈరోజు మద్యాహ్నం 12గంటల నుండి అమ్మకానికి అందుబాటులో ఉండనున్నాయి.
వన్ ప్లస్ నార్డ్ CE3 5G ఫోన్ ఫీఛర్స్:
6.7అంగుళాల Full HD+ AMOLED డిస్ ప్లే స్క్రీన్ కలిగి ఉన్న ఈ ఫోన్, 50MP (OIS) Sony IMX890 గల ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంది. అలాగే 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.
Details
5,000mAh బ్యాటరీ సామర్థ్యం
స్నాప్ డ్రాగన్ 782G చిప్ సెట్ కలిగిన ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5,000mAhగా ఉంది. 80వాట్స్ అడాప్టర్ తో ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది.
OxygenOS 13.1 ఆండ్రాయిడ్ వ్యవస్థను కలిగి ఉంది.
వన్ ప్లస్ నార్డ్ ఫోన్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. మరీ ఎక్కువ ధర కాకుండా మరీ తక్కువ ధర కాకుండా మధ్య రేంజిలో సరిపోయే ఫోన్ కాబట్టి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.
ఈ ఫోన్లకు రీసేల్ వాల్యూ కూడా బాగానే ఉంది.
వన్ ప్లస్ నార్డ్ కి పోటీగా Redmi Note 12 Pro+, POCO F5, Motorola Edge 40, Nothing Phone (1) ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి.