LOADING...
OnePlus: వన్‌ప్లస్ మూసేస్తున్నారా?… వార్తలపై స్పందించిన CEO
వన్‌ప్లస్ మూసేస్తున్నారా?… వార్తలపై స్పందించిన CEO

OnePlus: వన్‌ప్లస్ మూసేస్తున్నారా?… వార్తలపై స్పందించిన CEO

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2026
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

టెక్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తూ 'వన్‌ప్లస్' కంపెనీని దశలవారీగా మూసేస్తున్నారంటూ ఓ నివేదిక కలకలం రేపింది. ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనం ప్రకారం, వన్‌ప్లస్ బ్రాండ్ అమ్మకాలు తగ్గడం, కొన్ని డివైసులు రద్దుకావడం, అంతర్గత వర్గాల సమాచారం ఆధారంగా కంపెనీని 'డిస్మాంటిల్' చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఈ వార్తలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారంపై వన్‌ప్లస్ ఇండియా CEO రాబిన్ లియూ స్పందించారు. X (ట్విట్టర్)లో ఆయన పోస్ట్ చేస్తూ, "వన్‌ప్లస్ ఇండియా కార్యకలాపాలపై తప్పుదారి పట్టించే సమాచారం ప్రచారంలో ఉంది. మా వ్యాపార కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతాయి. నెవర్ సెటిల్" అని స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాబిన్ లియూ చేసిన ట్వీట్ 

వివరాలు 

వన్‌ప్లస్ ఇండియా వ్యాపారం యథావిధిగా కొనసాగుతోంది: లియూ

అదే పోస్ట్‌లో ఓ ఇమేజ్‌ను కూడా షేర్ చేసిన లియూ, "వన్‌ప్లస్ మూసేస్తున్నారంటూ వస్తున్న నిర్ధారణలేని వార్తలు అసత్యం. వన్‌ప్లస్ ఇండియా వ్యాపారం యథావిధిగా కొనసాగుతోంది. అధికారిక వనరుల నుంచి సమాచారం నిర్ధారించుకోకుండా ఎవరూ ఇలాంటి వార్తలు పంచుకోవద్దు" అని పేర్కొన్నారు. దీంతో వన్‌ప్లస్ మూసేస్తుందన్న వార్తలకు కంపెనీ స్పష్టంగా తెరదించింది.

Advertisement