Loading...
OpenAI Odessia Acquisition: ట్రావెల్ రంగంలోకి ఓపెన్‌ఏఐ.. ఒడెస్సియాను సొంతం చేసుకున్న టెక్ దిగ్గజం
ట్రావెల్ రంగంలోకి ఓపెన్‌ఏఐ.. ఒడెస్సియాను సొంతం చేసుకున్న టెక్ దిగ్గజం

OpenAI Odessia Acquisition: ట్రావెల్ రంగంలోకి ఓపెన్‌ఏఐ.. ఒడెస్సియాను సొంతం చేసుకున్న టెక్ దిగ్గజం

వ్రాసిన వారు Balachander Sharma
Nov 11, 2026
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓపెన్‌ఏఐ మరో కీలక అడుగు వేసింది. ఏఐ ఆధారిత ట్రావెల్ ఏజెంట్‌ ఒడెస్సియా (Odessia)ను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఒడెస్సియా వ్యవస్థాపకుడు ఫ్రాన్సిస్ డేవిడ్‌సన్ వెల్లడించారు. ఒప్పందం విలువను మాత్రం ఇరు సంస్థలు వెల్లడించలేదు. డీల్‌ తీరు చూస్తే ఇది పూర్తిస్థాయి కంపెనీ కొనుగోలు కంటే డేవిడ్‌సన్‌ను ఓపెన్‌ఏఐలోకి తీసుకునే అక్వి-హైర్ తరహా ఒప్పందంగా కనిపిస్తోంది. ఇకపై ఓపెన్‌ఏఐలో చేరిన డేవిడ్‌సన్‌.. భవిష్యత్ ట్రావెల్‌ అనుభవాల కోసం ఏఐ ల్యాబ్‌తో కలిసి పనిచేయనున్నారు.

Details

ఏడాది వయసున్న స్టార్టప్‌కు ఇదే చివరి అడుగు

డేవిడ్‌సన్‌ ప్రారంభించిన ఒడెస్సియా వయసు కేవలం ఏడాది మాత్రమే. సీక్వోయా నేతృత్వంలో 6 మిలియన్ డాలర్ల ప్రీ-సీడ్ పెట్టుబడి కూడా ఈ స్టార్టప్‌ సమీకరించింది.

సుమారు ఐదు నెలల క్రితమే ఏఐ ట్రావెల్ ఏజెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రయాణ ప్రణాళికలు రూపొందించడంలో ప్రారంభ వినియోగదారులకు లక్షల డాలర్ల విలువైన ట్రిప్‌లను ప్లాన్ చేయడంలో ఇది సహాయపడిందని డేవిడ్‌సన్‌ చెప్పారు.

అయితే ఓపెన్‌ఏఐ డీల్‌ ప్రకటించే సమయానికి ఒడెస్సియా సేవలను నిలిపివేశారు.

Details

ట్రావెల్‌పై ఓపెన్‌ఏఐకి పెరుగుతున్న ఆసక్తి

ప్రస్తుతం ట్రావెల్‌ కోసం ప్రత్యేకమైన కొత్త ఉత్పత్తిని ఓపెన్‌ఏఐ ప్రకటించలేదు.

అయితే Booking.com, Expedia, KAYAK వంటి ట్రావెల్‌ సంస్థలతో ఇప్పటికే సంబంధాలు ఉన్నాయి. ChatGPTని ఉపయోగిస్తున్న వారిలోనూ ప్రయాణ ప్రణాళికలు, బుకింగ్స్‌ వంటి అవసరాల కోసం ఏఐని ఆశ్రయించే వారి సంఖ్య గణనీయంగా ఉంది.

వారానికి 1.2 బిలియన్ మంది ChatGPTని ఉపయోగిస్తున్నారని ఓపెన్‌ఏఐ తెలిపింది. అందులో ట్రావెల్‌ ప్లానింగ్‌ కూడా తరచుగా అడిగే అంశాల్లో ఒకటిగా పేర్కొంది.

ADVERTISEMENT

Details

సోండర్‌తో మొదలైన డేవిడ్‌సన్‌ ప్రయాణం

ఫ్రాన్సిస్ డేవిడ్‌సన్‌కు ట్రావెల్‌ రంగంలో అనుభవం కొత్తది కాదు. 2014లో కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే Sonder అనే ట్రావెల్‌ స్టార్టప్‌ను ప్రారంభించారు.

ప్రముఖ నగరాల్లో ఉన్న ప్రీమియం అపార్ట్‌మెంట్లను స్వల్పకాలిక అద్దెకు అందించే ఈ సంస్థ Airbnb తరహాలో గుర్తింపు తెచ్చుకుంది.

అయితే కోవిడ్‌ ప్రభావం, ఆర్థిక ఇబ్బందులు, కీలక భాగస్వామ్యం విఫలం కావడంతో Sonder చివరకు దివాలా ప్రక్రియలోకి వెళ్లింది.

అయినప్పటికీ డేవిడ్‌సన్‌ అనుభవం ఇప్పుడు ఓపెన్‌ఏఐకి ట్రావెల్‌ రంగంలో కొత్త అవకాశాలను తెరవొచ్చనే ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT