ChatGPT on whatsapp: వాట్సప్‌లో చాట్‌జీపీటీ సదుపాయం.. అకౌంట్‌తో పనిలేదిక.. ఎలా వాడాలంటే?
మైక్రోసాఫ్ట్ మద్దతుతో పనిచేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్లాట్‌ఫామ్ అయిన ఓపెన్‌ఏఐ (OpenAI) తాజాగా కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. '12 డేస్ ఆఫ్ ఓపెన్‌ఏఐ' పేరిట ప్రకటించిన ఈ కొత్త సేవలో, వాట్సప్‌లో నేరుగా చాట్‌జీపీటీ (ChatGPT) అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి ప్రత్యేకమైన యాప్ లేదా అకౌంట్ అవసరం లేకుండా నేరుగా వాట్సప్‌లోనే చాట్‌జీపీటీని ఉపయోగించవచ్చు. ఈ సేవను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది ఓపెన్‌ఏఐ. +1800 242 8478 నంబర్ ద్వారా వాట్సప్‌లో చాట్‌జీపీటీతో చాటింగ్ చేయవచ్చు. ఈ సేవలు భారత్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.ఈ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా కూడా చాట్‌జీపీటీ సేవలను పొందవచ్చు. అయితే, ప్రస్తుతం ఈ సేవలు అమెరికా, కెనడాకే పరిమితం కావడం గమనార్హం.
వాట్సప్‌లో ఈ సేవను పొందేందుకు ప్రత్యేకంగా అకౌంట్ అవసరం ఉండదు
చాట్‌జీపీటీ సేవను పొందాలంటే, సాధారణంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం అవసరం. కానీ వాట్సప్‌లో ఈ సేవను పొందేందుకు ప్రత్యేకంగా అకౌంట్ అవసరం ఉండదు. ఈ సేవను ఉపయోగించే users పై రోజువారీ పరిమితి ఉండటంతో, ఆ పరిమితి దగ్గర పడినప్పుడు నోటిఫికేషన్ ద్వారా వివరాలు అందజేయబడతాయి. భవిష్యత్‌లో, చాట్‌జీపీటీకి సెర్చ్, ఇమేజ్ ఆధారిత ఇంటరాక్షన్, మరియు కన్వర్జేషన్ మెమొరీ లాగ్స్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. మెటా సంస్థ కూడా వాట్సప్‌లో తమ AI చాట్‌బాట్ సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో, ఓపెన్‌ఏఐ వాట్సప్‌లో చాట్‌జీపీటీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం మెటా సంస్థకు ప్రత్యామ్నాయం కావడమే కాకుండా, మరింత మందికి చేరువ చేసేందుకు ఒక అడుగు ముందుకువేస్తోంది.