
ChatGPT: భారత్‌లో చాట్‌జీపీటీ Go ప్లాన్..నెలకు కేవలం ₹399!
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలందిస్తున్నఓపెన్ఏఐ భారత్‌లో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ChatGPT Goను ప్రారంభించింది. ఈ ప్లాన్‌ను నెలకు ₹399తో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లకు ఎక్కువ వాడుక పరిమితులు, ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్‌లోడ్స్, ఎక్స్‌టెండెడ్ మెమరీ వంటి సౌకర్యాలు లభించనున్నాయి. ఫ్రీ ప్లాన్,ప్లస్ ప్లాన్ మధ్యలో వంతెనలా ఈ కొత్త టియర్‌ను రూపొందించారు. భారత్‌లో ఎక్కువ మందికి సరసమైన ధరలో ఈ సదుపాయాలు అందించాలన్నదే OpenAI ఉద్దేశ్యం.
వివరాలు
ఫ్రీ, ప్లస్ మధ్య గో ప్లాన్ ప్రత్యేకతలు
ఈ కొత్త ప్లాన్ ద్వారా యూజర్లు ఫ్రీ ప్లాన్‌తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ మెసేజ్ లిమిట్స్, ఇమేజ్ జనరేషన్స్, ఫైల్ అప్‌లోడ్స్ పొందవచ్చు. అంతేకాక, మెమరీ పొడవు కూడా రెట్టింపు అవుతుంది. దీంతో విద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, ప్రొఫెషనల్స్‌కి ఇది మంచి ఆప్షన్‌గా మారుతుంది. ఫ్రీ ప్లాన్‌తో సరిపోని, కానీ ప్లస్ లేదా ప్రో ప్లాన్‌లో ఉన్న అన్ని ఫీచర్లు అవసరం లేని వారికి ఇది సరైన ఎంపిక అవుతుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ChatGPT Plus ప్లాన్ ₹1,999 కాగా, ఇందులో లెగసీ మోడల్స్‌తో పాటు డీప్ రీసెర్చ్, ఏజెంట్ మోడ్, సోరా వీడియో క్రియేషన్ వంటి అధునాతన టూల్స్ ఉంటాయి.
వివరాలు
యూపీఐ చెల్లింపులు - రూపాయల్లో ధరలు
కొత్త ప్లాన్‌తో పాటు, OpenAI తన అన్ని సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీలను ఇప్పుడు నేరుగా భారత రూపాయల్లో (INR) చూపిస్తోంది. దీంతో కరెన్సీ కన్వర్షన్ సమస్యలు తొలగిపోతాయి. అంతేకాక, మొదటిసారిగా UPI చెల్లింపులను కూడా అంగీకరించనుంది. దీంతో సబ్‌స్క్రిప్షన్‌కు అప్‌గ్రేడ్ అవ్వడం మరింత సులభం కానుంది.
వివరాలు
అందరికీ AI
చాట్‌జీపీటీ గోను భారత్‌లో ముందుగా లాంచ్ చేయడం ద్వారా, ధరలకు సున్నితమైన మార్కెట్లో కూడా AI వినియోగాన్ని పెంచాలనే OpenAI వ్యూహం స్పష్టమవుతోంది. ఇప్పటివరకు ప్రధానంగా ఎంటర్‌ప్రైజ్‌లు, ప్రీమియం యూజర్లకే లభించిన జనరేటివ్ AI టూల్స్‌ను ఇప్పుడు విద్యార్థులు, క్రియేటివ్ ప్రాజెక్ట్స్ చేసే వారు, సాధారణ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కూ చేరువ చేయడమే ఈ చర్య వెనుక ఉద్దేశ్యం.