LOADING...
Oppo Reno 15C: 7000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న ఒప్పో రెనో 15C.. అధునాతన ప్రాసెసర్, స్లిమ్ డిజైన్ 
7000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న ఒప్పో రెనో 15C.. అధునాతన ప్రాసెసర్, స్లిమ్ డిజైన్

Oppo Reno 15C: 7000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న ఒప్పో రెనో 15C.. అధునాతన ప్రాసెసర్, స్లిమ్ డిజైన్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2025
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

Oppo త్వరలో భారత మార్కెట్లో 'Reno 15 సిరీస్'ను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉందని తెలిసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Mini మోడల్స్‌ను కంపెనీ అధికారికంగా ప్రమోట్ చేసింది. అయితే తాజాగా లీక్స్ ప్రకారం Reno 15C అనే నాలుగో మోడల్ కూడా ఈ సిరీస్‌లో చేరే అవకాశం ఉంది. Oppo ఇటీవల చైనాలో కూడా 'Reno 15C' ను లాంచ్ చేసింది. కానీ, అదే ఫోన్ భారత మార్కెట్లోకి వస్తుందా లేదా అనే విషయం కంపెనీ ఇప్పటివరకు ధృవీకరించలేదు. లీక్స్ ఆధారంగా Reno 15C కూడా Reno 15, 15 Pro, 15 Pro Miniతోపాటు భారత్‌లో లాంచ్ కావచ్చు.

Details

భారత వెర్షన్ Reno 15C ముఖ్య ఫీచర్లు 

ఈ ఫోన్ ధర రూ. 40,000 లోపే ఉండే అవకాశం ఉంది. డిస్‌ప్లే: 6.57-అంగుళాల Full-HD+ LTPS OLED, 120Hz రిఫ్రెష్ రేట్, 1,400nits HBM బ్రైట్‌నెస్ ప్రాసెసర్: Snapdragon 6 Gen 1 చిప్‌సెట్ రామ్ & స్టోరేజ్: 12GB వరకు RAM + 256GB స్టోరేజ్ (సింగిల్ వేరియంట్) కెమెరా సెటప్ ట్రిపుల్ రియర్: 50MP ప్రధాన సెన్సర్ + 8MP అల్ట్రా వైడ్ + 2MP మాక్రో 50MP ఫ్రంట్ అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరా బ్యాటరీ & డిజైన్ 7,000mAh భారీ బ్యాటరీ + 80W ఫాస్ట్ ఛార్జింగ్ స్లిమ్ డిజైన్: 8.14mm, బరువు: 189-195 గ్రాములు

Details

చైనాలో లాంచ్ అయిన Reno 15C స్పెసిఫికేషన్లు

డిస్‌ప్లే: 6.59-అంగుళాల AMOLED Full-HD+, 120Hz, 1,200nits పీక్ బ్రైట్‌నెస్ ప్రాసెసర్: Snapdragon 7 Gen 4 చిప్‌సెట్ రామ్ & స్టోరేజ్: 12GB RAM + 512GB స్టోరేజ్ కెమెరా: ట్రిపుల్ రియర్ 50MP (OIS) + 50MP టెలిఫోటో (OIS) + 8MP అల్ట్రా వైడ్, 50MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 6,500mAh + 80W ఛార్జింగ్ భారత మార్కెట్‌లో Reno 15 సిరీస్ పై వినియోగదారుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. కానీ నాలుగో మోడల్ Reno 15Cపై అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement