LOADING...
Indian Defence: ప్రత్యర్థులు మన ముందు 'డమ్మీ'లు: భారత్‌ కొత్త వ్యూహంతో ముందుకు
ప్రత్యర్థులు మన ముందు 'డమ్మీ'లు: భారత్‌ కొత్త వ్యూహంతో ముందుకు

Indian Defence: ప్రత్యర్థులు మన ముందు 'డమ్మీ'లు: భారత్‌ కొత్త వ్యూహంతో ముందుకు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2025
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉపగ్రహాలు, డ్రోన్లు, కృత్రిమ మేధ (AI) వంటివి ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ, యుద్ధానికి సంబంధించిన మూల సూత్రాలు వందల సంవత్సరాలుగా మారవు. ప్రత్యర్థి దృష్టిని మోసిపెట్టడం, బోల్తా కొట్టడం వంటి పద్ధతులు కాలంతోపాటు ఆధునిక రూపంలో కొనసాగుతున్నాయి. భారత్‌ కూడా ఇటువంటి మాయా వ్యూహాల ద్వారా శత్రువును దాడికి వృథా చేయించడమే కాక, స్వీయ కీలక ఆయుధాలను భద్రంగా ఉంచడంలో నడుము బిగిస్తోంది.

Details

యుద్ధ సమయంలో మొదటి దశ

దేశాలు సాధారణంగా ప్రత్యర్థి యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇటీవలి ఆపరేషన్‌ సిందూర్‌లో కూడా పాకిస్తాన్‌ మన ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నించింది. ఒక దశలో పాక్‌ సైనికాధికారులు దానిని ధ్వంసం చేశామన్న వ్యాఖ్య చేశారు. దీన్ని ఖండిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌లోని ఆదంపుర్‌ వైమానిక స్థావరంలో ఎస్‌-400 ముందు ప్రసంగించారు. పోరాట సమయాల్లో, విలువైన ఆయుధాలను రక్షించడం అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

Details

డికాయ్ అంటే ఏమిటి?

మొత్తం ఆయుధ వ్యవస్థను పోలిన రబ్బరు డమ్మీని డికాయ్‌ అంటారు. గాలితో నింపినప్పుడు, అది నిజమైన ఆయుధాన్ని పోలినట్లు కనిపిస్తుంది. వీటిని వ్యూహాత్మక ప్రదేశాల్లో మోహరించి, శత్రు డ్రోన్లు, ఉపగ్రహాలు, యుద్ధవిమానాలకు కనపడేలా చేస్తారు. వాస్తవ ఆయుధాలను గోప్యంగా ఉంచుతారు. శత్రు, డికాయ్‌లను నిజమైన ఆయుధాలుగా భావించి దాడి చేస్తాడు. ప్రతి డికాయ్ కూడా రాడార్, పరారుణ వ్యవస్థల వద్ద వాస్తవ ఆయుధాల ముద్రను ప్రతిబింబిస్తుంది, తద్వారా శత్రువును మోసగించవచ్చు.

Details

భారత వాయుసేన ప్రణాళికలు

సుఖోయ్-30 ఎంకేఐ, రఫేల్, తేజస్ వంటి యుద్ధవిమానాలు, ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థలకు సంబంధించిన 400 డికాయ్‌లను భారత్‌ సమకూర్చాలని భావిస్తోంది. సైన్యం తన టి-90 యుద్ధ ట్యాంకుల డమ్మీలను కూడా మోహరించనుంది. చైనా సరిహద్దుల్లో అసలైన ట్యాంకులను ఇప్పటికే మోహరించడం జరిగింది. ఉక్రెయిన్ ఉదాహరణ ఇప్పటివరకు ఉక్రెయిన్‌ రష్యా సైన్యాన్ని గందరగోళానికి గురి చేయడానికి డికాయ్ వ్యూహాన్ని ఉపయోగించింది. హైమార్స్‌ రాకెట్ వ్యవస్థ, ఎఫ్‌-16 యుద్ధవిమానాల డమ్మీలను మోహరించి, శత్రువును మోసగించింది.

Details

డికాయ్‌ల ప్రయోజనాలు

ప్రత్యర్థి నిఘా వ్యవస్థలను గందరగోళానికి గురి చేస్తాయి. డమ్మీలపై దాడి చేయడం వల్ల విలువైన ప్రిసిషన్‌ గైడెడ్‌ ఆయుధాలు వృథా అవుతాయి. వాస్తవ ఆయుధాలను రక్షించడానికి శత్రువుకు ఎక్కువ నిఘా ప్రయత్నాలు అవసరం అవుతాయి. మన కీలక ఆయుధాలు భద్రంగా ఉంటాయి.

Details

చరిత్రలో డికాయ్ వ్యూహం 

మధ్య యుగాల్లో, సైనిక శిబిరాలను, రాత్రి పెద్ద మంటలను ఉపయోగించి శత్రువులను మోసగించేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో డమ్మీ సైనికులు, నకిలీ ట్యాంకులు, కందకాలతో శత్రువులను భ్రమలో పడేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో 'డెజర్ట్‌ ఫాక్స్' ఎర్విన్‌ రోమెల్ ఉత్తర ఆఫ్రికాలో రబ్బరు డమ్మీ ట్యాంకులు, శతఘ్నులతో శత్రువును మోసగించాడు. అమెరికా, బ్రిటన్‌ కూడా నకిలీ విమానాలు, రేడియో సంకేతాలతో శత్రువులను భ్రమలో పడేశారు.

Details

ఆధునిక సాంకేతికత

'సోనిక్ డిసెప్షన్‌' విధానం ద్వారా రికార్డు చేసిన ధ్వనులను శత్రువుకు వినిపిస్తూ, భారీ సైనిక బలగాలు, శతఘ్ని దళాలు ఉన్నట్లు భ్రమింపచేస్తున్నారు.