LOADING...
Perplexity Comet: భారత్‌లో పర్‌ప్లెక్సిటీ కామెట్‌ బ్రౌజర్‌ విడుదల 
భారత్‌లో పర్‌ప్లెక్సిటీ కామెట్‌ బ్రౌజర్‌ విడుదల

Perplexity Comet: భారత్‌లో పర్‌ప్లెక్సిటీ కామెట్‌ బ్రౌజర్‌ విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2025
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ AI మోడల్ "పర్‌ప్లెక్సిటి" భారత్‌లో తన కొత్త బ్రౌజర్‌ 'కామెట్‌' (Perplexity Comet)ను విడుదల చేసింది. ఇది ప్రస్తుతానికి కేవలం ప్రో సబ్‌స్క్రైబర్లకే అందుబాటులో ఉంటుంది అని కంపెనీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఒక ఎక్స్‌ పోస్ట్‌లో ధృవీకరించారు. ఈ బ్రౌజర్‌ ప్రస్తుతం విండోస్‌ (Windows) మాక్‌ (Mac) పరికరాల్లో మాత్రమే పని చేస్తుందని తెలిపారు. ఆండ్రాయిడ్‌ వినియోగదారులు దీన్ని ఉపయోగించాలంటే గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రీ-రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉందని కంపెనీ తెలిపింది. అయితే, అధికారిక రిలీజ్‌ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ, ఇది విష్‌లిస్ట్‌ నుంచి మాత్రం ముందస్తుగా అందుబాటులో ఉంది.

వివరాలు 

వినియోగదారులకు మరింత సౌకర్యవంతం

కామెట్‌ బ్రౌజర్‌ తొలి సారి 2025 జులైలో విడుదల చేసింది. దీన్ని పర్‌ప్లెక్సిటి AI సెర్చ్‌ ఇంజిన్ ఆధారంగా రూపొందించారు. వ్యాపారులు, రీసెర్చర్లు, లోతైన విజ్ఞానం కోసం శోధించేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ బ్రౌజర్‌ నేరుగా AI తో అనుసంధానమైనందున వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. మల్టిపుల్‌ ట్యాబ్స్‌, ప్రాజెక్టులను ఒకేసారి నిర్వహించడానికి ఇందులో AI సైడ్‌బార్ అసిస్టెంట్‌ ఏర్పాటు చేయబడింది. ఉదాహరణకి, వినియోగదారులు ఈకామర్స్ వెబ్‌సైట్లలో డెలివరీ సమయాలను పోల్చుకోవాలనుకుంటే, ఈ అసిస్టెంట్‌ ఆ సాయం చేస్తుంది.