Perplexity: స్నాప్‌చాట్‌లో పెర్‌ప్లెక్సిటీ AI.. $400 మిలియన్ల ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియా దిగ్గజం స్నాప్ ఇన్‌క్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ పెర్‌ప్లెక్సిటీతో కలిసి పనిచేయనున్నట్టు స్నాప్ ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ సుమారు $400 మిలియన్లు. దీని ద్వారా పర్ప్లెక్సిటీ తయారుచేసిన AI-ఆధారిత అన్సర్ సర్చ్ ఇంజిన్ను నేరుగా స్నాప్‌చాట్ యాప్‌లోకి కలపనున్నారు. ఈ ఫీచర్‌ను 2026 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది స్నాప్‌చాట్‌లో ఇప్పటికే ఉన్న చాట్ ఇంటర్‌ఫేస్‌లో భాగంగా పనిచేస్తుంది.
ఫీచర్ వివరాలు
2026లో అందుబాటులోకి వచ్చే కొత్త చాట్‌బాట్
ప్రస్తుతం నెలకు దాదాపు ఒక బిలియన్ మంది యూజర్లు స్నాప్‌చాట్‌ను వాడుతున్నారు. కొత్త AI సిస్టమ్‌తో యూజర్లు యాప్‌లోనే ప్రశ్నలు అడిగి, స్పష్టమైన, సులభమైన సమాధానాలు పొందగలరు. స్నాప్ AIని మనుషుల మధ్య కమ్యూనికేషన్‌లో సహజంగా మిళితం చేసే దిశగా ఇది తీసుకున్న పెద్ద అడుగుగా భావిస్తున్నారు. పెర్‌ప్లెక్సిటీ సంస్థ, ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే సమయంలో, స్నాప్‌కు క్యాష్ మరియు ఈక్విటీ రూపంలో $400 మిలియన్లను చెల్లించనుంది.
CEO కామెంట్స్
ఇరువురు CEOల స్పందనలు
పెర్‌ప్లెక్సిటీ CEO అరవింద్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "ప్రపంచాన్ని తెలుసుకోవడం, కొత్త విషయాలు కనుగొనడం కోసం స్నాప్‌చాట్‌ను లక్షలాది మంది వాడుతున్నారు. ఆ ఆసక్తిని ఉన్నచోటే తీర్చడమే మా లక్ష్యం. అందుకే ఈ భాగస్వామ్యం కీలకం" అన్నారు. స్నాప్ CEO ఇవాన్ స్పీగెల్ మాట్లాడుతూ: "AI ని మరింత వ్యక్తిగతం, సామాజికం, సరదాగా మార్చడానికి ఇది పెద్ద మెట్టు. భవిష్యత్తులో మరిన్ని AI సంస్థలతో కూడా పనిచేయాలని చూస్తున్నాం" అని వెల్లడించారు.
భవిష్యత్తు ప్రణాళికలు
స్నాప్‌చాట్ - AI కేంద్రంగా?
ఇప్పటికే స్నాప్ చాట్‌లో ఉన్న My AI చాట్‌బాట్‌తో పాటు ఇప్పుడు పెర్‌ప్లెక్సిటీ AI కూడా పనిచేయనుంది. ఇది నిజమైన, నమ్మదగిన, రియల్ టైమ్ సమాచారం ఇవ్వగలిగే అన్సర్ ఇంజిన్లా పనిచేస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా స్నాప్‌చాట్‌ను AI ఆధారిత డిస్కవరీ, లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందని కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని AI సంస్థలతో ఇలాంటివే ఒప్పందాలు వచ్చే అవకాశం ఉందని స్పీగెల్ షేర్‌హోల్డర్లకు పంపిన లేఖలో సూచించారు.