Pixel 11 Leak: గ్లోబల్ కొరత ప్రభావం.. Pixel 11లో RAM తగ్గే అవకాశాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న RAM కొరత ప్రభావం స్మార్ట్ ఫోన్ రంగంపై పడుతున్నట్లు తెలుస్తోంది. తాజా లీకుల ప్రకారం,గూగుల్ విడుదల చేయబోయే Pixel 11 సిరీస్‌లో స్పెసిఫికేషన్లు కొంత తగ్గే అవకాశం ఉంది. MysticLeaks తెలిపిన సమాచారం ప్రకారం, Pixel 11 బేస్ మోడల్‌లో ప్రస్తుతం ఉన్న 12GB RAM స్థానంలో కేవలం 8GB RAM మాత్రమే ఇవ్వొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాలు
యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడంపై గూగుల్ దృష్టి
అలాగే Pro, Pro XL, Pro Fold మోడళ్లలో కూడా 16GB నుంచి 12GB వరకు RAM తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో ప్రో మోడళ్లలో కెమెరా సామర్థ్యం, డిస్‌ప్లే బ్రైట్నెస్ వంటి అంశాల్లో అప్‌గ్రేడ్లు ఉండనున్నాయి. దీంతో యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడంపై గూగుల్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ RAM కొరత ప్రభావం స్మార్ట్‌ఫోన్లకే పరిమితం కాకుండా, గేమింగ్ డివైసులు, రాస్ప్‌బెర్రీ పై వంటి టెక్ ఉత్పత్తులపై కూడా పడుతోంది. ధరలు పెరగడం, స్పెక్స్ మారడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.