NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Apple Glowtime Event : ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్.. ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ఎయిర్‌పాడ్స్ 4 లాంచ్.. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే..!
    తదుపరి వార్తా కథనం
    Apple Glowtime Event : ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్.. ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ఎయిర్‌పాడ్స్ 4 లాంచ్.. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే..!
    ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్.. ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ఎయిర్‌పాడ్స్ 4 లాంచ్

    Apple Glowtime Event : ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్.. ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ఎయిర్‌పాడ్స్ 4 లాంచ్.. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 10, 2024
    12:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్, ప్రతిష్టాత్మక గ్లోటైమ్ బిగ్ ఈవెంట్ సందర్భంగా అనేక కొత్త ఆపిల్ ప్రొడక్టులను లాంచ్ చేసింది.

    ముఖ్యంగా ఐఫోన్ 16 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ 10, ఆపిల్ వాచ్ అల్ట్రా, ఎయిర్‌పాడ్స్ వంటి పరికరాలను అధునాతన ఫీచర్లతో పరిచయం చేసింది.

    ఈ డివైజ్‌లు ఆకర్షణీయమైన డిజైన్, అనేక అప్‌గ్రేడ్లతో విడుదలయ్యాయి. వాటిలోని సరికొత్త ఫీచర్లు యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచే విధంగా రూపొందించబడ్డాయి.

    ఇక కొత్త జనరేషన్ ఆపిల్ వాచీలు, ఎయిర్‌పాడ్స్ గురించి మరింత వివరంగా చూద్దాం.

    ప్రత్యేకత 

    ఆపిల్ వాచ్ అల్ట్రా 2 ప్రత్యేకతలు

    ఆపిల్ తన కొత్త జనరేషన్ వాచ్ అయిన అల్ట్రా 2ను కూడా విడుదల చేసింది.ఇది అత్యుత్తమ పనితీరు కోసం రూపొందించబడింది.ఇందులో స్ట్రాంగ్ టైటానియం కేస్,స్క్రాచ్-రెసిస్టెంట్ సఫైర్ క్రిస్టల్ ఉన్నాయి.

    వాచ్ అల్ట్రా 2 డ్యూయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్,అధునాతన పొజిషనింగ్ సాఫ్ట్‌వేర్ కలిగి ఉంది.తద్వారా మెరుగైన జీపీఎస్ పనితీరును అందిస్తుంది.

    అల్ట్రా 2 అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.ఇందులో కస్టమైజ్డ్ వర్కౌట్స్,ఆటోమేటిక్ స్ట్రోక్ డిటెక్షన్,ల్యాప్ కౌంటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

    యాక్షన్ బటన్‌తో లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను యూజర్ కంట్రోల్ చేయవచ్చు.ఇది డైవింగ్ డెప్త్ గేజ్, ఆఫ్‌లైన్ మ్యాప్స్,టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది.

    అలాగే అథ్లెట్ల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన ఈ వాచ్,రోజువారీ పర్యటనల నుండి విస్తృత ప్రయాణాల వరకు అనువైనది.

    వివరాలు 

    ఆపిల్ వాచ్ సిరీస్ 10, అల్ట్రా 2 ధరలు

    ఆపిల్ వాచ్ సిరీస్ 10 జీపీఎస్ మోడల్‌కు 399 డాలర్లు, జీపీఎస్+ సెల్యులార్ మోడల్‌కు 499 డాలర్ల ధరతో లాంచ్ అయింది.

    అలాగే ప్రీమియం ఆపిల్ వాచ్ అల్ట్రా 2 799 డాలర్ల ధరతో విడుదలైంది. సెప్టెంబర్ 20 నుండి అమెరికాలో ఈ మోడల్స్ ప్రీ-ఆర్డర్‌లు అందుబాటులో ఉన్నాయి.

    వివరాలు 

    ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 4 ప్రత్యేకతలు

    ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 4 రెండు మోడల్స్‌లో లాంచ్ అయ్యాయి. 3డీ ఫోటోగ్రామెట్రీ, లేజర్ టోపోగ్రఫీతో రూపొందించిన ఈ ఎయిర్‌పాడ్స్, సౌకర్యం, ఫిట్‌నెస్‌ను మెరుగుపరుస్తాయి.

    హెచ్2 చిప్ ఆధారంగా వచ్చిన ఈ ఎయిర్‌పాడ్స్, అధిక ఆడియో క్వాలిటీతో పాటు రిచ్ బాస్, క్లియర్ హైస్‌ను అందిస్తాయి.

    ఈ ఎయిర్‌పాడ్స్ పర్సనలైజ్డ్ స్పేషియల్ ఆడియో, హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్, వాయిస్ ఐసోలేషన్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి.

    కొత్త ఎయిర్‌పాడ్స్ 30 గంటల బ్యాటరీ లైఫ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్‌పరెంట్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపిల్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    ఆపిల్

    Apple: ఆపిల్ సరఫరాదారు ఫాక్స్‌కాన్ భారతదేశంలో AI సర్వర్‌లను తయారు చేయాలని యోచిస్తోంది టెక్నాలజీ
    Apple: కెమెరా-ఇంటిగ్రేటెడ్ ఎయిర్‌పాడ్‌లపై పనిచేస్తున్న ఆపిల్  టెక్నాలజీ
    Apple : ఆపిల్ విజన్ ప్రోలో AI సామర్థ్యాలను చేర్చడానికి సిద్ధంగా ఉంది టెక్నాలజీ
    Pro AR headset : Appleకి సరసమైన విజన్ ప్రో AR హెడ్‌సెట్ సరఫరాదారులు కావాలి  టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025