Loading...
Qantas Jobs India: ఆస్ట్రేలియా ఉద్యోగాలు భారత్‌కు.. క్వాంటాస్‌ కీలక నిర్ణయం
ఆస్ట్రేలియా ఉద్యోగాలు భారత్‌కు.. క్వాంటాస్‌ కీలక నిర్ణయం

Qantas Jobs India: ఆస్ట్రేలియా ఉద్యోగాలు భారత్‌కు.. క్వాంటాస్‌ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Balachander Sharma
Nov 10, 2026
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ క్వాంటాస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న సుమారు 850 కార్పొరేట్‌ ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్‌ చేయాలని నిర్ణయించింది. వీటిలో ఎక్కువ పోస్టులను భారత్‌లోని బృందాలకు అప్పగించనుంది. ఈ మార్పు 2027 మధ్య నుంచి ప్రారంభం కానుంది. ఫైనాన్స్‌, ప్రొక్యూర్‌మెంట్‌, ఉద్యోగుల నిర్వహణ, మార్కెటింగ్‌ వంటి విభాగాల్లోని పనులు ప్రధానంగా భారత్‌కు, కొంత భాగం ఆస్ట్రేలియాలోని బృందాలకు మారనున్నాయి. టెక్నాలజీ, AI ఆధారిత మార్పులను వేగంగా అమలు చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

Details

ఉద్యోగులకు ముందే సమాచారం

క్వాంటాస్‌ సీఈవో వెనెస్సా హడ్సన్‌ మంగళవారం ఉద్యోగులకు పంపిన అంతర్గత ఈమెయిల్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ నిర్ణయం కొంతమంది ఉద్యోగులకు కష్టమైన వార్తేనని, దీనివల్ల ఏర్పడే అనిశ్చితికి చింతిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

ఉద్యోగాల కోతకు బదులుగా సాధ్యమైన చోట్ల ప్రభావిత సిబ్బందిని ఇతర విభాగాల్లోకి మార్చేందుకు ప్రయత్నిస్తామని కంపెనీ తెలిపింది.

ఆస్ట్రేలియాలోనే కొత్త అవకాశాలు కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది.

Details

AIతో మారుతున్న ఉద్యోగ ప్రపంచం

క్వాంటాస్‌ తీసుకున్న నిర్ణయం వెనుక ప్రధాన కారణాల్లో AI, ఆటోమేషన్‌ కూడా ఉన్నాయి. టెక్నాలజీలో గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మార్పులు వస్తున్నాయని హడ్సన్‌ చెప్పారు.

క్వాంటాస్‌ ప్రతి ఏడాది టెక్నాలజీపై 1 బిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్లకు పైగా ఖర్చు చేస్తోంది.

అయితే దశాబ్దాల క్రితం రూపొందించిన పాత IT వ్యవస్థలు ఇప్పటికీ సంస్థలో కొనసాగుతున్నాయి. వీటిలో ఒకదానితో ఒకటి సరిగ్గా పనిచేయని 1,000కుపైగా లెగసీ అప్లికేషన్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది.

ADVERTISEMENT

Details

యాక్సెంచర్‌తో భారీ టెక్‌ డీల్

క్వాంటాస్‌ తాజాగా టెక్నాలజీ దిగ్గజం యాక్సెంచర్‌తో బహుళ సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది.

ఇందులో భాగంగా సంస్థలోని కొన్ని కార్పొరేట్‌ కార్యకలాపాలను పూర్తిగా పునర్వ్యవస్థీకరించనుంది.

ఒకే పనిని వేర్వేరు విభాగాలు చేసే విధానాన్ని తగ్గించి, వ్యవస్థలను సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో యాక్సెంచర్‌ నిర్వహించే పనుల్లోనూ మరింత ఆటోమేషన్‌, AI వినియోగం పెరగనుంది.

ADVERTISEMENT

Details

28 వేల మంది ఉద్యోగులున్న సంస్థ

ప్రస్తుతం క్వాంటాస్‌లో ఆస్ట్రేలియాలో సుమారు 28,000 మంది, ప్రపంచవ్యాప్తంగా మరో 4,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులు రోజువారీ పనుల్లో AIని ఉపయోగిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.

ఈ నేపథ్యంలో 850 కార్పొరేట్‌ ఉద్యోగాలను ఔట్‌సోర్స్‌ చేయడం కేవలం ఖర్చు తగ్గింపు చర్యగా కాకుండా, సంస్థ మొత్తం టెక్నాలజీ వ్యవస్థను మార్చే ప్రణాళికలో భాగంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా, పెరిగిన ఇంధన ఖర్చుల కారణంగా విమాన ఛార్జీలు పెంచడం, కొన్ని విమాన సర్వీసులను తగ్గించడం వంటి నిర్ణయాలను కూడా క్వాంటాస్‌ ఇటీవల ప్రకటించింది.

ADVERTISEMENT