Qualcomm: స్నాప్ డ్రాగన్ 8 Gen 3 లో రెండు వేరియంట్లను లాంచ్ చేయబోతున్న క్వాల్ కామ్
హవాయ్ లో అక్టోబర్ 24వ తేదీన జరగనున్న స్నాప్ డ్రాగన్ సమ్మిట్ కి క్వాల్ కామ్ సిద్ధమవుతోంది. స్నాప్ డ్రాగన్ 8 Gen 3 చిప్ సెట్ ని లాంచ్ చేసేందుకు క్వాల్ కామ్ రెడీ అవుతోంది. లాంచ్ తేదీకి చాలా సమయం ఉండగానే, స్నాప్ డ్రాగన్ 8 Gen 3 ఫీఛర్ల గురించి ఒకానొక డాక్యుమెంట్ లీక్ అయ్యింది. దాని ప్రకారం స్నాప్ డ్రాగన్ 8 Gen 3 లో రెండు వేరియంట్లు విడుదల కాబోతున్నాయి. TSMC's 4nm ప్రాసెస్ కోడ్ తో ఒక వేరియంట్, TSMC's N3E 3nm ప్రాసెస్ కోడ్ తో మరొకటి విడుదల అవుతున్నాయి.
చిన్న చిన్న ట్రాన్సిస్టర్లతో 3nm వేరియంట్
ఇప్పుడు లాంచ్ కాబోతున్న స్నాప్ డ్రాగన్ 8 Gen 3 చిప్ సెట్, వేడిని నిరోధిస్తుంది. ఈ చిప్ సెట్లు.. హీట్ ని నిరోధిస్తాయి. 3nm వేరియంట్ చిప్ అనేది చూడటానికి చిన్నగా ఉంటుంది. చిన్న చిన్న ట్రాన్సిస్టర్లు కలిగి ఉండి మంచి సామర్థ్యంతో పని చేస్తాయి. TSMC's N3E 3nm వేరియంట్ అనేది TSMC's 4nm కంటే ఎక్కువ అడ్వాంటేజీని అందిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఆపిల్ నుండి A17 Pro ఒక్కటే 3nm వేరియంట్ చిప్ సెట్ ని కలిగి ఉంది. గతంలో రిలీజైన Snapdragon 8 Gen 2 కంటే అడ్వాన్స్ ఫీఛర్లతో Snapdragon 8 Gen 3 లాంచ్ వస్తుంది.