సూపర్ బ్లూ మూన్: ఆగస్టు 30వ తేదీన ఏ సమయంలో చంద్రుడు అత్యంత పెద్దగా కనిపిస్తాడో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
బ్లూ మూన్ గురించి మనందరికీ తెలుసు. ఒక నెలలో రెండవసారి పౌర్ణమి రావడాన్ని బ్లూ మూన్ అని పిలుస్తారు.
సాధారణంగా ఒక నెలలో ఒకేసారి మాత్రమే పౌర్ణమి వస్తుంది. ఆ సమయంలో చంద్రుడు ఎక్కువ ప్రకాశవంతంగా మరింత పెద్దగా కనిపిస్తాడు. కానీ కొన్నిసార్లు ఒక నెలలో రెండు సార్లు పౌర్ణమి వస్తుంది. దీన్నే బ్లూ మూన్ అంటారు.
ప్రస్తుతం ఆగస్టు 30వ తేదీన సూపర్ బ్లూ మూన్ సంభవించబోతుంది. అంటే ఒకే నెలలో రెండవసారి పౌర్ణమి రావడంతో పాటు ఈసారి చంద్రుడు చాలా పెద్దగా కనిపించబోతున్నాడు.
బ్లూ మూన్ సమయంలో కనిపించే దానికంటే 14% పెద్దదిగా చంద్రుడు కనిపించబోతున్నాడని నాసా చెబుతోంది. అందుకే దీన్ని సూపర్ బ్లూ మూన్ అని పిలుస్తున్నారు.
Details
చంద్రుడు బ్లూ కలర్ లో కనిపిస్తాడా?
బ్లూ మూన్ అనగానే చంద్రుడు నీలిరంగులో కనిపిస్తాడని కొంతమంది అనుకుంటారు. నిజానికి అది అబద్ధం.
ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి రావడాన్ని బ్లూ మూన్ అనే పరిభాషతో పిలుస్తారే తప్ప చంద్రుడు నిజంగా నీలిరంగులో కనిపించడు.
అదలా ఉంచితే, ప్రస్తుతం సూపర్ బ్లూ మూన్ ఏ సమయంలో బాగా కనిపిస్తుందో చూద్దాం. ఆగస్టు 30వ తేదీన రాత్రి 8:37 EDT సమయంలో సూపర్ బ్లూ మూన్ అత్యంత ప్రకాశంగా కనిపించబోతుంది.
కొన్ని దేశాల్లో సూపర్ బ్లూ మూన్ ఆగస్టు 31వ తేదీన కనిపించనుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
ఇప్పుడు కనిపించే సూపర్ బ్లూ మూన్ మళ్లీ 2037వ సంవత్సరంలో జనవరి, మార్చ్ నెలల మధ్య కాలంలో సంభవించే అవకాశం ఉందట.