Page Loader
రియల్ మీ 11 ప్రో సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
రియల్ మీ 11 ప్రో

రియల్ మీ 11 ప్రో సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2023
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తునన రియల్ మీ 11 ప్రో సిరీస్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. రియల్ మీ మరోసారి సరికొత్త ఫీచర్స్ తో స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. రియల్ మీ 11 ప్రో, రియల్ మీ 11 ప్రో ప్లస్ సిరీస్ అనే రెండు మోడల్స్ సంస్థ లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. ముఖ్యంగా రియల్ మీ ప్రో ప్లస్ లో 200MP కెమెరా కలిగి ఉండడం విశేషం. అదే విధంగా ఆకట్టుకునే మూన్ షాట్‌లతో సహా అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. ఈ ఫోన్లు త్వరలో అమెజాన్, రియల్ మీ వెబ్ సైట్‌లో విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి.

Details

రూ.2వేలు డిస్కౌంట్ పొందే అవకాశం

రియల్ మీ 11 ప్రో 5 జీ 5జీ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.23,999 ఉండగా.. 8GB + 256GB వేరియంట్‌ ధర రూ.24,999, 12GB + 256GB వేరియంట్‌ ధర రూ.27,999గా ఉండనుంది. మరోవైపు రియల్‌మీ 11 ప్రో+ 5G 8GB + 256GB ధర రూ.27,999, 12GB + 256GB ధర రూ.29,999లకు లభించనుంది. జూన్ 8న సాయంత్రం 6-8 గంటల మధ్య ఈ ఫోన్ కొంటే 2వేలు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. వివిధ బ్యాంకు కార్డులపై రియల్ మీ ప్రో 5జీ ప్లస్ కొనుగోలులో రూ.2వేలు, రియల్ ప్రో ప్లస్ పై రూ.1500 వరకు కంపెనీ రాయితీ ఇవ్వనుంది.