శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 108 ఎంపీ కెమెరాతో కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54, 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత్ మార్కెట్లోకి ఇవాళ విడుదల చేశారు. 6000 బ్యాటరీ సామర్థ్యం, అడ్వాన్స్ డే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54 ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇందులో 108 ఎంపీ నో షేక్ కెమెరా, 120 హెర్జ్స్ అమొలెడ్ డిస్ ప్లే ను అమర్చారు. ప్రత్యేక ఫీచర్స్ గా నైటోగ్రఫీ, ఆస్ట్రోలాప్స్ ఉండనున్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ తో అల్ట్రా హెచ్ డీ 4కే రికార్డింగ్ చేసే అవకాశం ఉంది. ఇందులో 6.7 అంగుళాల ఎస్ అమోలెడ్ ప్లస్ డిస్ ప్లే ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54 స్మార్ట్ ఫోన్ ధర రూ. 29999
ఇది 5 జీ నెట్ వర్క్ ను సపోర్టు చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీటియో బ్లూ, స్టార్ డస్ట్ సిల్వర్ అనే రెండు రంగుల్లో లభించనుంది. ఈ ఫోన్ ను కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ నుంచి కానీ, శాంసంగ్ అధికారిక వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది. 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ తో లభించే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54 స్మార్ట్ ఫోన్ ప్రస్తుత ధర రూ. 29999గా ఉంది. ప్రారంభ ఆఫర్ గా రూ. 2 వేల డిస్కౌంట్ తో రూ. 27999లకే లభించనుంది. జూన్ 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ ఫోన్ ను ఫ్రీ ఆర్డర్ చేసుకోవచ్చు.