Reliance Jio: రిలయన్స్ జియో డేటా వోచర్‌ల వాలిడిటీలో మార్పు
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో యూజర్లకు షాకిచ్చింది. రోజువారీ డేటా పరిమితి ముగిసినప్పుడు వినియోగించుకునే రూ.19, రూ.29 డేటా వోచర్ల వ్యాలిడిటీని తగ్గించింది. జియో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ప్లాన్లను పరిశీలిస్తే, కొత్త కాలపరిమితులు ఇప్పటికే అమలులోకి వచ్చాయని స్పష్టమవుతోంది.
రూ.11తో తక్కువ ధరలో మరో డేటా ప్యాక్
రోజువారీ డేటా అయిపోయినప్పుడు అదనపు డేటా అవసరమైనప్పుడు ఇంటర్నెట్ సేవలు పొందేందుకు జియో ప్రత్యేక డేటా ప్యాక్లను అందిస్తోంది. రూ.19 ప్లాన్ ద్వారా 1GB డేటా, రూ.29 ప్లాన్ ద్వారా 2GB డేటా పొందవచ్చు. ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసే వరకు ఈ డేటా వోచర్లకు వ్యాలిడిటీ ఉండేది. తాజాగా, ఈ కాలపరిమితిని తగ్గించారు. రూ.19 ప్లాన్‌ను ఒక రోజు కాలపరిమితితో అందిస్తున్నారు, కాగా రూ.29 ప్లాన్‌కు రెండు రోజుల గడువు నిర్ణయించారు. అదనంగా, రూ.11తో తక్కువ ధరలో మరో డేటా ప్యాక్‌ను కూడా అందిస్తున్నారు. ఈ ప్యాక్ కేవలం ఒక గంట కాలపరిమితితో అందిస్తుండగా, ఇందులో అపరిమిత డేటా వినియోగించుకోవచ్చు.