2023లో కూడా ఇంటి నుండి పనిచేసే సౌకర్యం కొనసాగుతుందా?
వచ్చే ఏడాది US జాబ్ మార్కెట్ బలహీనంగా కొనసాగితే, కంపెనీలు రిమోట్‌గా పని చేయడానికి ఉద్యోగులను అనుమతించకుండా వెనక్కి తీసుకోవచ్చు. ఉద్యోగులు సాధారణంగా ఇంటి నుండి పని చేయడంపై రెండు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహమ్మారి సమయంలో ఇంటి నుండి పనిచేస్తూ ఎంతో సమయాన్ని ఆదా చేయడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కొందరు చెప్తే, మరికొందరు కంపెనీ సంస్కృతి కార్యాలయంలో సరైన విధంగా ఉంటుందని చెప్పారు. రిమోట్ వర్క్ 2023లో కొనసాగుతుందని నిపుణులు చెప్పే ప్రధాన కారణాలు ఏంటంటే.. 1. నిలుపుదల: ఉద్యోగులను నిలుపుకోవడం కోసం రిమోట్ పనిని అనుమతించడం కీలకం. ఒక అధ్యయనం ప్రకారం, హైబ్రిడ్ పని యజమానుల సంతృప్తిని, ఉత్పాదకతను 35% తగ్గించింది.
రిమోట్ వర్క్ వలన అర్హత గల ఉద్యోగులు దొరకడం సులభం
2. రిక్రూట్‌మెంట్: రిమోట్ వర్క్ ఎక్కడివారినైనా ఎక్కడైనా పనిచేసేలా చేయడం వలన కొన్ని ప్రత్యేక ఉద్యోగాలకు అర్హత గల ఉద్యోగులు ఇటువంటి సౌకర్యం వలన దొరుకుతున్నారు. 3. మాంద్యం ఖర్చు తగ్గింపులు: రిమోట్ వర్క్ ఆఫీస్ అవసరాన్ని తగ్గించడం వలన కొన్ని కంపెనీలు తమ ఆఫీసు అవసరాలకు ఖర్చు తగ్గించుకుని మరింత మంది ఉద్యోగులను చేర్చుకోవడానికి ప్రణాళికలు వేస్తున్నాయి. ఇంటి నుండి పని చేసే ఉద్యోగులు కొన్ని అలవెన్సులు వదులుకోవడానికి ఇష్టపడుతున్నారు. 4. ఆఫీస్ కు మళ్ళీ పిలిపించడం వలన జరిగే ప్రమాదం: తిరిగి ఆఫీస్ కు రమ్మని కొన్ని కంపెనీలు కఠినంగా చెప్పడం వలన సంస్థకు అవసరమైన ఉద్యోగులు కంపెనీ వదిలివెళ్లిపోయే ప్రమాదం ఉంది. ట్విట్టర్ విషయంలో కూడా అదే జరిగింది.