
IAF: భారత వాయుసేనలో 60 ఏళ్ల సేవలకు గౌరవం.. మిగ్-21కి వీడ్కోలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత వాయుసేనకు ఎన్నో దశాబ్దాల పాటు వెన్నముక వలె నిలిచిన, యుద్ధాల్లో ఎన్నో విజయాలను అందించిన మిగ్-21 బైసన్ (MiG-21 BISON)ను వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ శుక్రవారం ఛండీగఢ్ వాయుసేన కేంద్రంలో చివరిసారిగా వీడ్కోలు పలికారు. స్వయంగా ఐఏఎఫ్ చీఫ్ ఈ మిగ్-21 పై చివరి సార్టికి వెళ్లనున్నారు.
Details
ప్రత్యేకతలు
మిగ్-21 రకం విమానం భారత వాయుసేనలో తొలిసారి అడుగుపెట్టింది అదే వాయుసేన కేంద్రంలోనే. నాటి రోజుల్లో 'ఫస్ట్ సూపర్ సోనిక్స్'గా వ్యవహరించే 28వ స్క్వాడ్రన్ కు మొదట ఇవి అప్పగించబడ్డాయి. ఆ స్క్వాడ్రన్‌కు నాయకత్వం వహించిన వింగ్ కమాండర్ దిల్బాగ్ సింగ్, తరువాత ఎయిర్ చీఫ్ మార్షల్ స్థాయికి చేరుకున్నారు. మిగ్-21లు దాదాపు 60 ఏళ్లకుపైగా వాయుసేనకు సేవలు అందించాయి.
Details
చివరి సార్టీ వివరాలు
23వ స్క్వాడ్రన్**కు చెందిన 6 మిగ్-21లు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. ఆరుగురు పైలట్లలో స్క్వాడ్రన్ లీడర్ ప్రియా శర్మ కూడా ఉన్నారు. సార్టీ పూర్తి చేసుకొని ల్యాండ్ అయిన తర్వాత జలఫిరంగులతో అభివాదం సమర్పించనున్నారు. ఐఏఎఫ్ చీఫ్ కాల్‌సైన్ 'బాదల్ 3'. ఈ వేడుకలో సీడీఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాల అధిపతులు, ఆరుగురు వాయుసేన మాజీ చీఫ్‌లు, ఐఏఎఫ్ కమాండ్‌ల అధిపతులు హాజరుకానున్నారు.
Details
మిగ్-21 రకం, శిక్షణ
భారత వాయుసేనలో తొలిసారిగా అడుగుపెట్టినవి మిగ్-21 టైప్-13 వేరియంట్లు వీటిపై శిక్షణ పొందేందుకు ఏడుగురు పైలట్లు రష్యాకు వెళ్లారు. వారిలో మాజీ వాయుసేనాధిపతి ఎయిర్ మార్షల్ దిల్బాగ్ సింగ్ కూడా ఉండటం విశేషం. మిగ్-21కి భారత వాయుసేనలో వీడ్కోలు పలకడం, దశాబ్దాల చరిత్రను గుర్తు చేసుకునే విధంగా ఘనంగా జరగనుంది.