
AI tutors: విద్యా రంగంలో విప్లవం.. భవిష్యత్తు బోధనలో ఏఐ ట్యూటర్లే ప్రధాన పాత్ర
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి చర్చలు రోజురోజుకు మరింత ఉత్సాహవంతంగా సాగుతున్నాయి. నేటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతికత వినియోగం కూడా ఆగకుండా పెరుగుతోంది. చిన్న ప్రశ్నలకు సమాధానాల కోసం, ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లను ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు. ఇదే నేపథ్యంలో డ్యులింగో సీఈఓ లూయిస్ వాన్ ఆన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్‌చల్ సృష్టించాయి. ఆయన చెప్పినట్లుగా, భవిష్యత్తులో పాఠాలు బోధించడంలో ప్రధాన పాత్ర ఏఐ ట్యూటర్లు పోషిస్తాయని చెప్పారు. ''ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఒక క్లాసులో 30 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు వ్యక్తిగత శ్రద్ధ చూపడం కష్టం.
Details
నమర్థవంతమైన విద్యను అందిస్తాయి
అయితే ఏఐ సాంకేతికత విద్యార్థుల బలహీనతలు, బలాలను తేలికగా గుర్తించి, వారికి సరైన విధంగా పాఠాలు బోధించగలదని ఆయన పేర్కొన్నారు. అందువల్ల, ఏఐ ట్యూటర్లు ఉపాధ్యాయుల కంటే మరింత సమర్థవంతమైన విద్యను అందించగలవని ఆయన భావించారు. అంతేకాదు, ఏఐ అభివృద్ధితో పాఠశాలల్లో ఉపాధ్యాయుల పాత్ర చిన్నారుల సంరక్షణ, పర్యవేక్షణగా మారుతుందని ఆయన చెప్పారు. ఈ మార్పు తక్షణమే కాదని, నెమ్మదిగా జరిగే పరిణామమని. విద్యా వ్యవస్థలో ఏఐ ట్యూటర్ల పాత్ర స్థిరంగా విస్తరిస్తోందని కూడా లూయిస్ వాన్ ఆన్ తెలిపారు. ముఖ్యంగా ఆధునిక విద్యా పద్ధతులు కావాల్సిన దేశాలలో ఈ మార్పు త్వరగా వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
Details
ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రాంతాల్లో డిజిటల్ సాధనాలు
అయితే, ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రాంతాల్లో డిజిటల్ సాధనాలను ప్రవేశపెట్టడం, ఉపాధ్యాయులకు ఏఐ టూల్స్ పై అవగాహన కల్పించడం సవాలుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందులో కొద్ది రోజుల క్రితం దక్షిణ కొరియా వంటి దేశాలు ముందంజ వేస్తున్నాయి. ఆ దేశం ఈ ఏడాది మార్చి నుండి పాఠశాలల్లో 30 శాతం తరగతులలో ఏఐ ఆధారిత డిజిటల్ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టింది. ఇటీవల ఆ దేశం నిర్వహించిన ఏపీఈసీ ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ఈ సాంకేతికత వినియోగాన్ని ప్రదర్శించగా, దాని ప్రభావం విద్యారంగంలో వెలుగొందింది.