LOADING...
Samsung: శాంసంగ్ వాలెట్‌లో కొత్త అప్‌డేట్‌.. సులభమైన యూపీఐ సెటప్‌, యూపీఐ లైట్‌, పిన్ లేకుండా బయోమెట్రిక్‌ పేమెంట్లు!
సులభమైన యూపీఐ సెటప్‌, యూపీఐ లైట్‌, పిన్ లేకుండా బయోమెట్రిక్‌ పేమెంట్లు!

Samsung: శాంసంగ్ వాలెట్‌లో కొత్త అప్‌డేట్‌.. సులభమైన యూపీఐ సెటప్‌, యూపీఐ లైట్‌, పిన్ లేకుండా బయోమెట్రిక్‌ పేమెంట్లు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2025
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

శాంసంగ్ కంపెనీ భారత మార్కెట్‌ కోసం తన వాలెట్‌ యాప్‌కు పెద్ద అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ అప్‌డేట్‌లో యూపీఐ (UPI) ఆన్‌బోర్డింగ్‌ సదుపాయం గెలాక్సీ డివైస్‌ సెటప్‌ సమయంలోనే ఇవ్వబడింది. అలాగే యూపీఐ లైట్‌ ఇంటిగ్రేషన్‌, పిన్‌ లేకుండా బయోమెట్రిక్‌ పేమెంట్‌ సదుపాయాలు కూడా ఇందులో భాగమయ్యాయి. దీంతో గెలాక్సీ యూజర్లు డిజిటల్‌ పేమెంట్స్‌ను మరింత సులభంగా ఉపయోగించుకునే వీలు కలుగుతుందని కంపెనీ తెలిపింది.

వివారాలు 

యూపీఐ సెటప్‌ మరింత సులభం 

ఇప్పటి వరకు కొత్త ఫోన్‌లో యూపీఐ ఉపయోగించాలంటే వేర్వేరు యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి వచ్చేది. ఇకపై కొత్త గెలాక్సీ ఫోన్‌ సెటప్‌ సమయంలోనే యూజర్‌ తన బ్యాంక్‌ ఖాతాను లింక్‌ చేసి, యూపీఐను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను సామ్‌సంగ్‌ భారతీయ నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (NPCI) పలు బ్యాంకులతో కలిసి అభివృద్ధి చేసింది. యూపీఐ లైట్‌, బయోమెట్రిక్‌ పేమెంట్లు కొత్త అప్‌డేట్‌లో యూపీఐ లైట్‌ సపోర్ట్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా చిన్న మొత్తాల లావాదేవీలు యూపీఐ పిన్‌ అవసరం లేకుండా,ఇంటర్నెట్‌ లేకపోయినా తక్షణమే పూర్తవుతాయి. అదనంగా, ఫింగర్‌ప్రింట్‌ లేదా ఫేస్‌ రికగ్నిషన్‌ ద్వారా బయోమెట్రిక్‌ పేమెంట్‌ చేయగలరు.

వివరాలు 

టాప్‌ & పే, అంతర్జాతీయ కార్డులకు సపోర్ట్‌ 

చిన్నచిన్న చెల్లింపులు చేయడంలో సమయాన్ని ఆదా చేయడమే కాకుండా,సెక్యూరిటీ కూడా కాపాడే విధంగా ఈ ఫీచర్‌ రూపొందించబడిందని సామ్‌సంగ్‌ తెలిపింది. యూపీఐతో పాటు, ఇప్పుడు వాలెట్‌ యాప్‌లోని టాప్‌,పే ఫీచర్‌ ద్వారా అంతర్జాతీయ,ఫారెక్స్‌ కార్డుల ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు. దీంతో డెబిట్‌, క్రెడిట్‌, ట్రావెల్‌ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండింటిలోనూ కాంటాక్ట్‌లెస్‌ పేమెంట్స్‌ చేయడం సులభమవుతుంది. అందుబాటులోకి తేదీలు ఈకొత్త ఫీచర్లు 2025 నవంబర్‌ నుండి భారతదేశంలోని గెలాక్సీ డివైస్‌లకు దశలవారీగా అందుబాటులోకి వస్తాయి. బయోమెట్రిక్‌ పేమెంట్‌ ఫీచర్‌ను సామ్‌సంగ్‌ డిసెంబర్‌ 2025 నుంచి మరిన్ని ఫోన్లకు దశలవారీగా విడుదల చేయనుంది. యూజర్లు ఈ అప్‌డేట్‌ను గ్యాలక్సీ స్టోర్‌ లేదా సెట్టింగ్స్‌ మెనూలో చెక్‌ చేసుకోవచ్చని సామ్‌సంగ్‌ సూచించింది.

Advertisement