ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం34 విడుదల, ధర, ఫీచర్లు ఇవే
శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్‌కు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. లెటెస్ట్ ఫోన్ల లాంచ్ కోసం కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే శాంసంగ్ M సిరీస్‌లో M34 5g ఫోన్‌ను లాంచ్ చేసింది. జులై 15 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. గతేడాది తీసుకొచ్చిన ఎం33కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను రిలీజ్ చేసింది. శాంసంగ్ ఎం34 5జీ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. రూ.999తో ప్రీ బుక్ చేసుకుంటే 25W అడాప్టర్ ఉచితంగా పొందొచ్చని కంపెనీ పేర్కొంది. మిడ్‌నైట్ బ్లూ, ప్రిజమ్ సిల్వర్, వాటర్ ఫాల్ బ్లూ రంగుల్లో ఈ మొబైల్ లభించనుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం34లో 6000 ఎంఎహెచ్ బ్యాటరీ సపోర్ట్
ఇక ఇందులో ట్రిపుల్ రేర్ కెమెరా, 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రావైడ్, 2ఎంపీ డెప్త్ సెన్సార్లు రానున్నాయి. సెల్ఫీల కోసం 12ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తుండటం గమనార్హం. మాన్స్టర్ షాట్ 2.0 ఫీచర్‌తో పాటు ఫన్ మోడ్, నైటోగ్రఫి వంటి ఆప్షన్స్ కూడా కొత్తగా వచ్చాయి. ఈ ఫోన్ లో 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో రెండ్రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ చెప్తోంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ శుక్రవారమే మొదలయ్యాయి. ఈనెల 15న అమెజాన్ ప్రై డే సేల్‌లో ఈ మొబైల్ సేల్స్ ప్రారంభం కానున్నాయి.