Page Loader
Samsung Galaxy S25: బిగ్‌బాస్కెట్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌25.. 10 నిమిషాల్లో డెలివరీ 
బిగ్‌బాస్కెట్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌25.. 10 నిమిషాల్లో డెలివరీ

Samsung Galaxy S25: బిగ్‌బాస్కెట్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌25.. 10 నిమిషాల్లో డెలివరీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2025
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీదారైన శాంసంగ్‌ ఇటీవల కొత్త మొబైల్‌ ఫోన్‌ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తన ఫ్లాగ్‌షిప్‌ మోడల్ గెలాక్సీ 'ఎస్‌' సిరీస్‌ నుండి ఎస్‌25 (Samsung Galaxy S25)ఫోన్‌లను విడుదల చేసింది. ఈ ఫోన్ల విక్రయాలు ఫిబ్రవరి 7 నుండి భారతదేశ మార్కెట్లో ప్రారంభం అవ్వనున్నాయి. ఈ ఫోన్లు ప్రముఖ క్విక్‌ కామర్స్‌ సంస్థ అయిన'బిగ్‌బాస్కెట్‌ (BigBasket)'లో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉందని సమాచారం. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌25, గెలాక్సీ ఎస్‌25 ఆల్ట్రా మోడళ్లను బిగ్‌బాస్కెట్‌ విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై క్విక్‌ కామర్స్‌ యాప్‌ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా, ఆ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఫోన్‌లకు సంబంధించిన టీజర్‌ ఉండటం వల్ల, విక్రయాలు జరుగనున్నాయని అర్థమవుతుంది.

వివరాలు 

బ్యాంకు ఆఫర్లు కూడా అందుబాటులో..

ఈ ఫోన్లు కేవలం 10 నిమిషాల్లోనే కస్టమర్లకు డెలివరీ చేయబడతాయని టీజర్‌లో పేర్కొనబడింది. అలాగే, కొన్ని బ్యాంకు ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయని సమాచారం. బిగ్‌బాస్కెట్‌లో గెలాక్సీ ఎస్‌25 ఫోన్ (12GB ర్యామ్‌ + 256GB స్టోరేజ్) ధర రూ.80,990గా ఉంటుందని టీజర్‌లో పేర్కొన్నారు. గెలాక్సీ ఎస్‌25 ఆల్ట్రా ఫోన్ (12GB ర్యామ్‌ + 512GB స్టోరేజ్) ధర రూ.1,29,999గా ఉంటుందని అంచనా. ఈ ఫోన్లపై రూ.10,000 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్‌ డిస్కౌంట్లు కూడా అందించబడతాయి. అంతేకాకుండా, నోకాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం. ఫిబ్రవరి 7 నుంచే ఈ ప్లాట్‌ఫామ్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

క్రోమా భాగస్వామ్యంతో ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌ డెలివరీలు

అయితే, బిగ్‌బాస్కెట్‌లో 10 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ డెలివరీలు చేయడం ఇదే తొలిసారి కాదు. 2024 సెప్టెంబరులో క్రోమా భాగస్వామ్యంతో ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌ డెలివరీలు కూడా 10 నిమిషాల్లో అందించింది. అయితే, ఈ సేవలు బెంగళూరు, దిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబయి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం శాంసంగ్‌ ఫోన్లను దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో అందిస్తారా? లేదా అన్నది ఇంకా తెలియరాలేదు.