
Samsung Galaxy Watch 6 సిరీస్: హృదయ స్పందనల్లో తేడాను పసిగట్టే వాచ్ వచ్చేసింది
ఈ వార్తాకథనం ఏంటి
Samsung Galaxy Watch 6 సిరీస్ నుండి గెలాక్సీ 6, గెలాక్సీ 6క్లాసిక్ అనే రెండు వాచెస్ రిలీజ్ అయ్యాయి.
ఆరోగ్యానికి సంబంధించిన సూచనలను, అప్డేట్లను ఈ వాచెస్ అందివ్వనున్నాయని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ హెడ్ టీఎమ్ రోహ్ అన్నారు.
మీరు సరిగ్గా నిద్రపోతున్నారా లేదా అనే విషయం దగ్గర నుండి తీసుకోవాల్సిన పోషకాహారం వరకు అప్డేట్లను ఈ వాచ్ అందిస్తుంది.
తమ వినియోగదారులు ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవడానికి ఈ వాచెస్ ని డిజైన్ చేసామని శాంసంగ్ కంపెనీ చెబుతోంది.
44mm, 40mm సైజులో ఉండే గెలాక్సీ 6 వాచ్ గ్రాఫైట్, సిల్వర్ రంగుల్లో ఉంటుంది.
గెలాక్సీ 6 క్లాసిక్ మాత్రం నలుపు, సిల్వర్ రంగుల్లో ఉండి, 43mm, 47mm సైజుల్లో దొరుకుతుంది.
Details
మీరెక్కడైనా పడిపోతే సమాచారాన్ని కాంటాక్టులకు అందించే ఫీఛర్
గెలాక్సీ 6 సిరీస్ వాచెస్ అనేవి మీ నిద్రా సైకిల్ ని మీకు చూపిస్తాయి. ఎంతసేపు నిద్రపోతున్నారు? ఏ సమయానికి నిద్రలేస్తున్నారు అనేది ఇందులో ఉంటుంది. అలాగే నిద్రకు ఉపక్రమించేలా చేసే సలహాలు, సూచనలు ఉంటాయి.
అలాగే శరీరంలో కొవ్వు ఎంతశాతం బీఎమ్ఆర్ రేటు మొదలైన పూర్తి విషయాలను ఇది తెలియజేస్తుంది.
హృదయ స్పందనల్లో తేడాను ఈ వాచ్ గుర్తించి నోటిఫికేషన్ అందిస్తుంది. నిద్రలో కూడా హృదయ స్పందనల్లో తేడాను ఇది చూపిస్తుంది.
ఒకవేళ మీరు ఏదైనా ప్రమాదానికి గురైతే ఎమర్జెన్సీ నంబర్స్ సహా మీకు అత్యంత దగ్గరైన వారికి సమాచారం అందిస్తుంది. అంటే మీరు కిందపడినా, లేదా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఈ ఫీఛర్ పనిచేస్తుంది.