'ఆదిత్య-ఎల్1' మిషన్‌కు నాయకత్వం వహిస్తున్న శాస్త్రవేత్త కె. శంకర సుబ్రమణియన్ ఎవరో తెలుసా?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోతంది. ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా ల్యాండింగ్ చేసిన ఇస్రో, శనివారం మొట్టమొదటి సౌర మిషన్ 'ఆదిత్య-ఎల్1'ను ప్రయోగించింది. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఆదిత్య-ఎల్1 మిషన్‌కు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.శంకరసుబ్రమణియన్ నాయకత్వం వహిస్తున్నారు. ఆదిత్య-ఎల్1 మిషన్‌లోని ప్రతి చర్య ఈయన కనుసన్నల్లోనే జరుగుతుంది. ఆదిత్య-ఎల్1 వ్యోమనౌక దాదాపు నాలుగు నెలల సుధీర్ఘ ప్రయాణం తర్వాత సూర్యుడి కక్ష్యలోకి వెళుతుంది. అది లక్ష్యాన్ని చేరే వరకు ప్రతి సెకను కె.శంకరసుబ్రమణియన్ పర్యవేక్షణలోనే జరుగుతుంది.
డాక్టర్ శంకరసుబ్రమణియన్ ఎవరు?
డాక్టర్ శంకరసుబ్రమణియన్‌కు స్యూర్యుడిపై పరిశోధనల్లో మంచి అనుభవం ఉంది. ఈయన బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్‌ఎస్‌సీ)లో అనేక సౌర అధ్యయనాలు చేశారు. బెంగుళూరు విశ్వవిద్యాలయంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పొందారు. ఇన్‌స్ట్రూమెంటేషన్, ఆప్టిక్స్, సౌర అయస్కాంత క్షేత్రంతో సహా పలు అంశాలపై ఆయన థీసెస్ రాశారు. ఆస్ట్రోశాట్, చంద్రయాన్-1, చంద్రయాన్-2 వంటి ఇస్రో మిషన్‌లకు శంకరసుబ్రమణియన్ కీలక సహకారం అందించారు. ప్రస్తుతం ఆయన యూఆర్‌ఎస్‌స్‌లోని స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ చీఫ్‌గా ఉన్నారు. ఈయన నాయకత్వంలోని బృందం ఆదిత్య-L1, XPoSat, చంద్రయాన్-3 కోసం సైన్స్ పేలోడ్‌తో సహా భవిష్యత్ మిషన్‌ల కోసం పరికరాలను అభివృద్ధి చేసింది.
ఆదిత్య-ఎల్1 మిషన్ అంటే ఏమిటి?
'ఆదిత్య-ఎల్1' అనేది భారతదేశపు మొట్టమొదటి సౌర అన్వేషణ మిషన్. ఇస్రోతో పాటు ఇతర భారతీయ పరిశోధనా సంస్థలు దీన్ని సంయుక్తంగా రూపొందించాయి. సూర్యునిపై సమగ్రంగా అధ్యయనం చేయడం కోసమే దీన్ని ప్రయోగించారు. సంస్కృతంలో 'ఆదిత్య' అనే పదం సూర్యుడిని సూచిస్తుంది. 'L1' అనేది సూర్యుడు-భూమి వ్యవస్థలో ఒక కీలకమైన ప్రదేశమైన లాగ్రాంజ్ పాయింట్ 1ని సూచిస్తుంది. ఈ కలిసేలా ఈ మిషన్‌కు 'ఆదిత్య-ఎల్1' అనే పేరు పెట్టారు. భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యుడి కక్ష్య మొదలవుతుంది. అంటే ఇది భూమి- స్యూర్యుడి మధ్య దురంలో వందో వంతు అని చెప్పాలి. దీనినే లాగ్రాంజ్ పాయింట్ 1 అంటారు. ఈ కక్ష్యనే భూమి- స్యూర్యుడిని వేరు చేస్తుంది.
అనేక ప్రశ్నలకు సమాధానం దొరకొచ్చు
లాగ్రాంజ్ పాయింట్-1 అనేది చాలా ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఈ పాయింట్ వద్ద భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తులు సమంగా ఉంటాయి. అందుకే ఆదిత్య ఎల్-1 మిషన్ మిషన్ కోసం లాగ్రాంజ్ పాయింట్-1ను ఎంచుకున్నారు. ఆదిత్య ఎల్-1 మిషన్‌లో ఏడు పెలోడ్లు ఉంటాయి. ఇందులో పేలోడ్‌లు సౌర వ్యవస్థపై మరింత అవగాహనను పెంచడానికి ఈ లాగ్‌రేంజ్ పాయింట్ వద్ద కణాలు, క్షేత్రాలను నిశితంగా విశ్లేషిస్తాయి. మిగిలిన నాలుగు పేలోడ్‌లు L1 కక్ష్య నుంచి సూర్యుడిని నేరుగా అధ్యయనం చేస్తాయి. సౌర వ్యవస్థలో సంక్లిష్ట పరస్పర చర్యలను అధ్యయనం చేసే సౌర భౌతిక శాస్త్రం, హీలియోఫిజిక్స్‌లో కొన్ని దీర్ఘకాలిక ప్రశ్నలకు కూడా ఈ పరిశోధన ద్వారా సమాధానాలు రావచ్చు.