Saturn's rings: 2025 నాటికి శనిగ్రహ వలయాలు అదృశ్యం కానున్నాయా?.. హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాలు త్వరలో కనుమరుగవుతాయంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా సౌర కుటుంబంలోని గ్రహాలన్నింటిలో శనిగ్రహం ప్రత్యేకంగా ఈ వలయాలతోనే ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. అయితే భూమి నుండి వీటిని చూస్తున్న వారికి 2025 మార్చి నాటికి ఈ వలయాలు కనిపించకపోవచ్చని తెలిపారు. శనిగ్రహం తన కక్ష్యలో సూర్యుడి చుట్టూ తిరిగే సమయంలో 26.7 డిగ్రీల అక్షీయ వంపు తీసుకుంటుంది. ఈ వంపు కారణంగా, భూమి నుండి చూసే వారికి శనిగ్రహం వలయాలు క్రమంగా అదృశ్యం కానున్నాయి. అయితే ఈ మార్పు తాత్కాలికమేనని, మార్చి 2025 తర్వాత మళ్లీ ఈ వలయాలు కనిపిస్తామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.