Chakshu portal : చక్షు పోర్టల్ తో ఆర్థిక మోసాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తెర
ఆర్థిక మోసాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే మొబైల్ నంబర్స్ ను ప్రభుత్వం బ్లాక్ చేస్తోంది. మీకు ఏదైనా స్కామ్ కాల్ వచ్చినా, మీరు ఏదైనా స్కామ్ బారిన పడినా ఆ నంబర్ పై వెంటనే టెలీకాం శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్ లో రిపోర్ట్ చేయండి. సర్వసాధారణంగా ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో మనల్ని ఫోన్ చేసి ఇబ్బందికి గురి చేస్తుంటాయి . మీకు స్ధలం , ప్లాట్, క్రెడిట్ కార్డు ,లోన్ కావాలా అంటూ విసిగించే కాల్స్ అనుభవం ప్రతి ఒక్కరికీ వుంటుంది.
మోసపూరిత కాల్స్ కు ఇకనుంచి తెర
టెలీకాం శాఖ మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించే హ్యాండ్ సెట్ లను, మొబైల్ నంబర్లను బ్లాక్ చేస్తోంది. వాయిస్ కాల్స్ ద్వారా, టెక్స్ట్ సందేశాల ద్వారా మొబైల్ వినియోగదారులను మోసం చేయడానికి ఈ హ్యాండ్ సెట్స్ ను, మొబైల్ నంబర్లను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి మోసగాళ్లను గుర్తించేందుకు టెలికాం శాఖ ఈ ఏడాది చక్షు పోర్టల్ (Chakshu portal) ను ప్రారంభించింది. మీరు కూడా ఆ పోర్టల్ లో మీకు వచ్చే స్కామ్ కాల్స్ పై రిపోర్ట్ చేయవచ్చు.
చక్షు పోర్టల్ నంబర్ కు ఫిర్యాదుతో తొలగనున్న చింతలు
సాలకు ఉపయోగించే నంబర్లను బ్లాక్ చేసిన టెలికాం శాఖ మొబైల్ లో ఫిషింగ్ సందేశాలు పంపిస్తున్న 52సంస్థలను టెలికాం శాఖ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఇప్పటివరకు 348మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసింది.10834అనుమానిత మొబైల్ నంబర్లను రీ వెరిఫికేషన్ కోసం గుర్తించింది. వీటిలో 8,272మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసింది.మీరు కూడా అటువంటి మోసాల బారిన పడినట్లయితే,దయచేసి వెంటనే అనుమానిత మోసాన్నిచక్షు పోర్టల్ కు ఫిర్యాదు చేయవచ్చు. మీరు కూడా ఫేక్ కాల్స్,అనుమానాస్పద ఎస్ఎంఎస్ లకు బలైపోతే, సంబంధిత శాఖ దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు వీలుగా చక్షు పోర్టల్ నంబర్ ను షేర్ చేయాలని వినియోగదారులకు ఆ శాఖ సూచిస్తోంది. ఇందుకోసం ముందుగా సంచార్ సాథీ వెబ్ సైట్ https://sancharsaathi.gov.in/sfc/ ను సందర్శించాల్సి వుంటుంది.