
Mysteries of space: అంతరిక్షంలో నీటి రిజర్వాయర్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు
ఈ వార్తాకథనం ఏంటి
శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఒక భారీ నీటి రిజర్వాయర్‌ను గుర్తించారు. దాని పరిమాణం భూమిపై ఉన్న మహాసముద్రాల కంటే 140 ట్రిలియన్ రెట్లు పెద్దది.
ఈ రిజర్వాయర్ ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్‌కు దగ్గరలో ఉంది. అది మన సూర్యుడి కంటే దాదాపు 20 బిలియన్ రెట్లు పెద్దది.
కాలిఫోర్నియాలోని పసాదేనాలోని నాసా జెట్ ప్రొపల్షన్ లాబోరేటరీ శాస్త్రవేత్తల బృందం ఈ రిజర్వాయర్‌ను కనుగొంది.
ప్రస్తుతం ఇది భూమి నుండి 12 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. విశ్వం ఆవిర్భవించిన కొద్దీ కాలంలో ఈ ప్రాంతంలో నీరు ఉండాల్సిన అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Details
విశ్వంలోనే అతిపెద్ద నీటి రిజర్వాయర్
ఈ రిజర్వాయర్ క్వాసర్ అనే బ్లాక్ హోల్ చుట్టూ ఉంది. ఇది వేల ట్రిలియన్ సూర్యులకు సమానమైన శక్తిని విడుదల చేస్తుంది.
దీనిని ఇప్పటివరకు మనం కనుగొన్న విశ్వంలోని అతిపెద్ద నీటి రిజర్వాయర్‌గా భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు క్వాసర్ చుట్టూ ఉన్న వాతావరణంలో నీటి ఆవిరిని గుర్తించారు.
ఆ ఆవిరి వందల కాంతి సంవత్సరాల వరకు విస్తరించిందని తెలిపారు. ఒక కాంతి సంవత్సరం ఆరు ట్రిలియన్ మైళ్లకు సమానం.