
Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం!
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ I/O 2025 ఈవెంట్‌లో గూగుల్ వినియోగదారుల కోసం ఓ విప్లవాత్మకమైన ఏఐ ఆధారిత షాపింగ్ అనుభవాన్ని పరిచయం చేసింది.
ఇది 'జెమినీ ఏఐ' సామర్థ్యాలను గూగుల్ షాపింగ్ గ్రాఫ్‌తో సమ్మిళితం చేసి, సులభతర, బుద్ధిమంతమైన, వ్యక్తిగతీకరించిన షాపింగ్ అనుభూతిని అందించనుంది.
జెమినీ ఏఐ + షాపింగ్ గ్రాఫ్
ఈ కొత్త షాపింగ్ ఫీచర్ వెనుక ప్రధానంగా పని చేస్తోంది గూగుల్ జెమినీ ఏఐ, షాపింగ్ గ్రాఫ్. ఈ గ్రాఫ్‌లో ప్రపంచవ్యాప్తంగా 50 బిలియన్లకు పైగా ఉత్పత్తుల లిస్టింగ్స్ ఉంటాయి.
ఇవి గంటకు ఒకసారి అప్డేట్ అవుతూ, రోజుకు 2 బిలియన్ వస్తువుల డేటాను సేకరిస్తుంది. అందులో ధరలు, రంగులు, స్టాక్ లభ్యత, రివ్యూలు వంటి సమగ్రమైన వివరాలు ఉంటాయి.
Details
AI Mode Shopping ఎలా పనిచేస్తుంది?
వినియోగదారులు 'Baby Toy' లాంటి పదాలను సెర్చ్ చేస్తే, గూగుల్ ఏఐ:
వయసు, అవసరాలు, ధరపరిమితి ఆధారంగా సరైన ఎంపికలు చూపిస్తుంది
చిత్రాలతో సహా వ్యక్తిగతీకరించిన ఫలితాలను అందిస్తుంది
Track price బటన్ ద్వారా ధర తగ్గినప్పుడు అలర్ట్ పంపుతుంది
వినియోగదారుడు సైజ్, కలర్, బడ్జెట్ ఎంపిక చేసుకోవచ్చు
గూగుల్ పే ద్వారా భద్రతగా, త్వరితంగా లావాదేవీలు చేయవచ్చు
Details
వర్చువల్ ట్రై-ఆన్ ఫీచర్
ఒక వినూత్న ఫీచర్‌గా 'వర్చువల్ ట్రై-ఆన్'ను ప్రవేశపెట్టారు
వినియోగదారులు తమ ఫోటోను అప్‌లోడ్ చేయగలుగుతారు.
మోడల్: గూగుల్ అభివృద్ధి చేసిన ప్రత్యేక ఇమేజ్ జనరేషన్ మోడల్ ఇది బాడీ షేప్, దుస్తుల ముడతలు వంటి అంశాలను విశ్లేషించి ఆ దుస్తులు ఎలా సరిపోతాయో చూపిస్తుంది.
Search Labsలో షర్ట్లు, ప్యాంట్లు, డ్రెస్సులు, స్కర్ట్స్ వంటి దుస్తులకు 'Try it on' ఐకాన్ ద్వారా వీక్షించవచ్చు ఫలితాలను సేవ్ చేయడం, షేర్ చేయడం కూడా సాధ్యం
Details
ఆగెంటిక్ చెక్ అవుట్ ఫీచర్
ఇక 'Agentic Checkout' అనే మరొక ఫీచర్ ద్వారా:
వినియోగదారుడు తక్కువ ప్రయత్నంతో సరైన ఉత్పత్తిని ఎంపిక చేసుకుని తక్షణంగా కొనుగోలు చేయగలుగుతాడు
సమయానికి సరైన నిర్ణయం తీసుకునేందుకు 'AI సూచనలు' అందించనుంది
అందుబాటులో ఎప్పుడు?
AI Mode Shopping, Agentic Checkout ఫీచర్లు అమెరికాలో రానున్న కొన్ని నెలల్లో ప్రారంభం కానున్నాయి ర్చువల్ ట్రై-ఆన్ ఫీచర్ ప్రస్తుతం అమెరికాలో Search Labs ద్వారా అందుబాటులో ఉంది