Slack outage: పని ప్రదేశంలో ఉపయోగించే స్లాక్ సేవలు డౌన్: ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు
ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు తమ సహోద్యోగులతో పనికి సంబంధించిన విషయాలపై మాట్లాడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది స్లాక్ ని వాడతారు. సహోద్యోగులతో మెసేజెస్, అవసరమైన డాక్యుమెంట్స్ పంపించడం, ఇంకా ఎన్నో సేవలను స్లాక్ అందిస్తుంది. అయితే ప్రస్తుతం స్లాక్ సేవలు డౌన్ అయ్యాయి. ఏమైందో తెలియదు కానీ స్లాక్ నుండి మెసేజెస్ చేయడం, కాల్స్ మాట్లాడటంలో అంతరాయం ఏర్పడింది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. స్లాక్ సేవలు డౌన్ కావడానికి కారణం ఏంటనే విషయంలో స్లాక్ కంపెనీ నిమగ్నమైంది.
మద్యాహ్నం 2:30గంటల నుండి సేవలు డౌన్
ఈరోజు మద్యాహ్నం 2:30గంటల నుండి స్లాక్ సేవలు డౌన్ అయ్యాయని, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని Downdetector.com అనే వెబ్ సైట్ వెల్లడి చేసింది. ఇండియా మొత్తంలో 450మంది స్లాక్ వినియోగదారులు, సేవలు డౌన్ కావడం వల్ల ఇబ్బంది పడుతున్నట్లు స్లాక్ కంపెనీకి తెలియజేసారు. ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు స్లాక్ సేవలను ఉపయోగిస్తాయి. ఇంటి నుండి పనిచేయడం(వర్క్ ఫ్రమ్ హోమ్) పెరిగిన తర్వాత స్లాక్ సేవలు ఉపయోగించుకునే కంపెనీలు కుడా పెరిగాయి. మరి స్లాక్ సేవలు డౌన్ కావడానికి కారణమేంటో కంపెనీకే తెలియాలి.