LOADING...
Snapchat: స్నాప్‌చాట్‌లో కొత్త ఫీచర్ 'క్విక్ కట్'.. సెకన్లలో వీడియో రెడీ
స్నాప్‌చాట్‌లో కొత్త ఫీచర్ 'క్విక్ కట్'.. సెకన్లలో వీడియో రెడీ

Snapchat: స్నాప్‌చాట్‌లో కొత్త ఫీచర్ 'క్విక్ కట్'.. సెకన్లలో వీడియో రెడీ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2025
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్నాప్‌ చాట్ వినియోగదారుల కోసం వీడియో ఎడిటింగ్‌ను మరింత సులభంగా మార్చే లక్ష్యంతో 'క్విక్ కట్' (Quick Cut) అనే కొత్త ఫీచర్‌ను స్నాప్‌చాట్ పరిచయం చేసింది. ఈ టూల్ ద్వారా యూజర్లు తమకు ఇష్టమైన మెమరీస్‌ను కేవలం కొన్ని సెకన్లలోనే సంగీతానికి తాళం వేసిన వీడియోలుగా మార్చుకుని షేర్ చేయవచ్చు. మెమరీస్ సెక్షన్‌తో పాటు ఫోన్‌లో ఉన్న కెమెరా రోల్ నుంచీ కూడా ఈ క్విక్ కట్ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. క్విక్ కట్ ఫీచర్‌లో ఒకేసారి అనేక ఫోటోలు లేదా వీడియో క్లిప్‌లను ఎంచుకుంటే, అవి వెంటనే కలిపి ఒక రెడీ వీడియోగా ప్రీవ్యూ చూపిస్తుంది. ఇందులో ఆటోమేటిక్‌గా మ్యూజిక్ జతకావడంతో పాటు, క్లిప్‌లకు సరిపోయేలా బీట్‌కు సింక్ అవుతుంది.

వివరాలు 

క్విక్ కట్ అధునాతన ఎడిటింగ్ ఎంపికలు 

యూజర్లకు కావాలంటే ఆ మ్యూజిక్ ట్రాక్‌ను మార్చుకునే అవకాశమూ ఉంటుంది. అదనంగా, వీడియోను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు లెన్స్‌లను కూడా జోడించవచ్చు. వివరమైన ఎడిటింగ్ కావాలనుకునే వారికోసం క్విక్ కట్‌లో టైమ్‌లైన్ ఎడిటర్ వంటి అడ్వాన్స్‌డ్ ఆప్షన్‌లను కూడా అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల వీడియోను పోస్ట్ చేసే ముందు అవసరమైన మార్పులు చేసుకునే వీలు ఉంటుంది. ఈ ఫీచర్ వాడకం చాలా ఈజీగా ఉండటంతో పాటు వినోదంగా కూడా ఉందని,వ్యక్తిగతంగా పరీక్షించిన వినియోగదారులు సానుకూలంగా స్పందిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ క్విక్ కట్ ఫీచర్ ఐఓఎస్ డివైస్‌లలో మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలోనే ఇతర ప్లాట్‌ఫారమ్‌లు, ఆండ్రాయిడ్ డివైస్‌లకు కూడా విస్తరించే యోచనలో స్నాప్‌చాట్ ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement