Social Media: పిల్లలను టార్గెట్ చేసిన సోషల్ మీడియా… విసిల్‌బ్లోయర్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
లాస్ ఏంజెల్స్‌లో ఇటీవల జరిగిన కేసులో, మెటా,యూట్యూబ్ తమ ప్లాట్‌ఫారమ్‌లను పిల్లలకు వ్యసనంగా మారేలా ఉద్దేశపూర్వకంగా డిజైన్ చేశాయని జ్యూరీ తేల్చింది. ఈ కేసును దగ్గరగా పరిశీలించిన బయోకెమిస్టు, పొగాకు రంగ విసిల్‌బ్లోయర్ Jeffrey Wigand, ఇది 1990లలో పెద్ద పొగాకు కంపెనీలు పిల్లలను లక్ష్యంగా చేసుకున్న కేసులను గుర్తుచేస్తోందన్నారు. 'ది గార్డియన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సోషల్ మీడియా కంపెనీలు కూడా ప్రకటనల ద్వారా పిల్లలను ఆకర్షించి వ్యసనపరులుగా మారుస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లో పొగాకు కంపెనీలు చేసినట్లే, ఇప్పుడు సోషల్ మీడియా సంస్థలు కూడా పిల్లలను "క్యాష్‌ఫ్లో"గా ఉపయోగిస్తున్నాయని చెప్పారు.
వివరాలు
పిల్లల మృదువైన మానసిక స్థితే లక్ష్యం
1989లో బ్రౌన్ & విలియమ్సన్ సంస్థలో పనిచేసిన విగాండ్, సిగరెట్లలో హానికర పదార్థాలపై ప్రశ్నలు లేవనెత్తడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. అదే విధంగా, సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌లు వ్యసనపరంగా మారుతున్నాయని తెలిసినా, పిల్లల మృదువైన మానసిక స్థితిని లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. ఇక ఈ కేసులో, Meta, YouTube కారణంగా ఒక యువతి నష్టపోయిందని జ్యూరీ తేల్చి, మొత్తం 6 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇందులో ఆ 3 మిలియన్ డాలర్లు కంపెనీల తప్పిదానికి శిక్షగా విధించిన అదనపు మొత్తం. ఈ తీర్పుతో సోషల్ మీడియా కంపెనీలపై భవిష్యత్తులో మరింత భారీ కేసుల ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు.