Page Loader
SpaceX: చంద్రునిపైకి 2 ప్రైవేట్ లూనార్ ల్యాండర్‌లను ప్రయోగించిన స్పేస్-X 
చంద్రునిపైకి 2 ప్రైవేట్ లూనార్ ల్యాండర్‌లను ప్రయోగించిన స్పేస్-X

SpaceX: చంద్రునిపైకి 2 ప్రైవేట్ లూనార్ ల్యాండర్‌లను ప్రయోగించిన స్పేస్-X 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2025
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్ష ప్రయోగాలకు చిన్న విరామం వచ్చింది. కానీ 2025 ప్రారంభంలోనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన స్పేస్‌-X (SpaceX) కొత్త మిషన్‌ను ప్రారంభించింది. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా రెండు ల్యాండర్లను విజయవంతంగా ప్రయోగించింది. భారత కాలమానం ప్రకారం, బుధవారం ఉదయం ఈ ప్రయోగం జరిగింది. ఫ్లోరిడాలోని నాసా (NASA) కెనెడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్-9 రాకెట్ బ్లూ ఘోస్ట్-1, ఐస్పేస్‌కు చెందిన హకుటో-ఆర్-2లను విజయవంతంగా ప్రయోగించింది. చంద్రుడిపై పరిశోధనలకు సంబంధించిన ఈ ప్రయోగం రెండు వేర్వేరు దేశాలకు మాత్రమే కాదు, వేర్వేరు సాంకేతికతలను కూడా ప్రదర్శిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్పేస్-X చేసిన ట్వీట్