Polaris Dawn: నలుగురు వ్యోమగాములతో.. పొలారిస్ డాన్ మిషన్‌ను ప్రారంభించిన స్పేస్ -X
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రఖ్యాత కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఉన్న 'స్పేస్-X(SpaceX)' సంస్థ మరొక చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది.
తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్‌వాక్ నిర్వహించేందుకు 'పోలారిస్ డాన్ (Polaris Dawn)' ప్రాజెక్టు కింద నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది.
ఈ ప్రయాణం ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ప్రారంభమైంది.
ఈ ముఖ్యమైన మిషన్‌కు వ్యాపారవేత్త జేర్డ్ ఇస్సాక్‌మన్ నాయకత్వం వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో అమెరికా ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగి స్కాట్ కిడ్ పైలట్‌గా ఉంటారు.
వారితో పాటు స్పేస్‌ఎక్స్‌కు చెందిన మిషన్ ఇంజినీర్లు సారా గిల్లి,అన్నా మెనోన్ కూడా పాల్గొంటున్నారు.
పోలారిస్ మిషన్‌లో ఇది మొదటి మానవసహిత యాత్రగా నిలుస్తుంది.ఈ ప్రాజెక్టులో పూర్తిగా స్పేస్‌ఎక్స్ పరికరాలనే ఉపయోగిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్పేస్ - X చేసిన ట్వీట్
Liftoff of Polaris Dawn! pic.twitter.com/hAti2arueX
— SpaceX (@SpaceX) September 10, 2024