
అత్యాధునిక AI వ్యవస్థలపై పరిశోధనలు ఆపేయండి: మస్క్‌తో పాటు 1000మంది ఐటీ నిపుణుల లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అనేది ఆధునిక సాంకేతిక విప్లవం. సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా పరిమితంగా వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే విచ్చవిడి తనం పెరిగితే మానవాళికే పెనుముప్పుగా పరిణమించొచ్చు. ప్రస్తుతం AI విషయంలో కూడా అలాంటి ఊహాగానాలే వెలువడుతున్నాయి.
ఈ భయాందోళనల నేపథ్యంలో అత్యాధునిక AI పరిశోధనలపై ప్రఖ్యాత ఐటీ నిపుణలు ఆందోళన వ్యక్తం చేశారు.
GPT-4 వంటి శక్తమంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలపై పరిశోధనలను కొన్నాళ్లు వాయిదా వేయాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో పాటు 1000మంది ఐటీ నిపుణులు సంతకాలు చేసిన లేఖను ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఈ లేఖను విడుదల చేసింది.
ఏఐ
మానవుడు నియంత్రించే శక్తమంతమైన AI వ్యవస్థలు మేలు: నిపుణులు
ప్రస్తుతం AI మార్కెట్లో GPT-4ను OpenAI సంస్థ మాత్రమే ప్రవేశపెట్టింది. మరికొన్ని సంస్థలు అత్యాధునిక AIపై విస్తృత పరిశోధనలు చేస్తున్నాయి.
సమాజానికి, మానవాళికి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అవసరమా? కాదా? అనే విషయంపై ఆయా సంస్థలు ఆలోచించుకోవాలని ఆ లేఖలో మస్క్ సహా మిగతా నిపుణులు కోరారు. మానవుడు నియంత్రించే శక్తమంతమైన AI వ్యవస్థలను మాత్రమే అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎలాంటి సవాళ్లు వచ్చినా ఎదుర్కోగలమని విశ్వాసం వచ్చినప్పుడే అత్యాధునిక AI వ్యవస్థలను అభివృద్ధి చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఒక ఆరో నెలల సమయంలో తీసుకుని , బాగా ఆలోచించుకుకొని నిర్ణయం తీసుకోవాలని లేఖలో చెప్పారు.