LOADING...
Sun : 40ఏళ్ళ నుండి భారతదేశంలో తగ్గుతున్నసూర్యకాంతి.. చర్యలు తీసుకొని ప్రభుత్వం  
40ఏళ్ళ నుండి భారతదేశంలో తగ్గుతున్నసూర్యకాంతి.. చర్యలు తీసుకొని ప్రభుత్వం

Sun : 40ఏళ్ళ నుండి భారతదేశంలో తగ్గుతున్నసూర్యకాంతి.. చర్యలు తీసుకొని ప్రభుత్వం  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2025
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో గత 40 సంవత్సరాల్లో సూర్యరశ్ములు తగ్గుతున్నాయి. 1988 నుంచి 2018 వరకు జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ఇది ఎక్కువగా మేఘాలు, వాయువులో ఎయిరోసోల్స్ పెరగడం వల్ల కలిగినట్లు పేర్కొన్నారు. ఈ పరిశోధన బనారాస్ హిందూ యూనివర్శిటీ, IITM, IMD కలిసి చేసింది. 20 వాతావరణ కేంద్రాల డేటాను పరిశీలించినప్పుడు సూర్యరశ్మి గంటల్లో స్థిరమైన తగ్గుదల కనిపించింది. భారత్‌లో ప్రతి సంవత్సరం సూర్యకిరణాల పరిమాణం కొంచెం కొంచెంగా తగ్గుతోంది.

వివరాలు 

ఎయిరోసోల్స్ నియంత్రణకు భారత్ సరైన చర్యలు తీసుకోలేదు 

1990లలో ఆర్థిక వృద్ధి, పట్టణీకరణ, పరిశ్రమల పెరుగుదల వల్ల ఎయిరోసోల్స్ ఎక్కువయ్యాయి. ఇది వాతావరణ పరిస్థితులను మార్చి, సూర్యరశ్ములను తగ్గిస్తుంది. చైనా,జపాన్ వంటి దేశాలు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, వాటి ప్రభుత్వం వెంటనే ఎయిరోసోల్స్ నియంత్రణకు చర్యలు తీసుకున్నాయి. ఆ సమయంలో భారత్ ఎయిరోసోల్స్ నియంత్రణకు సరైన చర్యలు తీసుకోలేదని పరిశోధకులు చెప్పారు. ఇక మరో ముఖ్య కారణం మేఘాల పెరుగుదల. ఎయిరోసోల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, మేఘాలు ఎక్కువ కాలం నిలిచిపోతాయి. సూర్యరశ్ములు భూభాగానికి చేరకుండా అడ్డుకుంటాయి. అందుకే సూర్యరశ్ముల పరిమాణం తగ్గిపోతుంది.