LOADING...
Sun Massive Explosion: సూర్యుడిపై ఒక్క రోజులో 17 భారీ 'ఎక్స్-క్లాస్' సౌరజ్వాలలు
సూర్యుడిపై ఒక్క రోజులో 17 భారీ 'ఎక్స్-క్లాస్' సౌరజ్వాలలు

Sun Massive Explosion: సూర్యుడిపై ఒక్క రోజులో 17 భారీ 'ఎక్స్-క్లాస్' సౌరజ్వాలలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2026
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనంత విశ్వంలో మన జీవనాధారమైన సూర్యుడు ప్రస్తుతం ఉగ్ర శక్తిని ప్రదర్శిస్తోంది. శాస్త్రవేత్తలే గాను ఆశ్చర్యానికి లోనైన విధంగా, సూర్యుడి ఉపరితలంపై కేవలం ఒక్క రోజులోనే 17 భారీ పేలుళ్లు సంభవించాయి. ఇవి సాధారణ సౌరజ్వాలలు కాకుండా, అత్యంత ప్రమాదకరమైన 'ఎక్స్-క్లాస్' రకానికి చెందినవి. ఈ సౌర పేలుళ్ల కేంద్రబిందువుగా తాజాగా కనిపించిన AR4366 అనే భారీ సన్‌స్పాట్ (Sunspot) నిలిచింది. ఈ మచ్చ పరిమాణం ఇంత పెద్దది, భూమిని విపరీతంగా ప్రభావితం చేసిన చారిత్రాత్మక 'క్యారింగ్‌టన్ ఈవెంట్' పరిస్థితులతో ఖగోళ శాస్త్రవేత్తలు పోలుస్తున్నారు. ఈ భారీ పేలుళ్ల కారణంగా ఏర్పడే అయస్కాంత మేఘాలు భూమికి దిశగా వచ్చినట్లయితే, మన కమ్యూనికేషన్ వ్యవస్థలు తీవ్రంగా అస్తవ్యస్తం కావచ్చని భావిస్తున్నారు.

వివరాలు 

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో 'రేడియో బ్లాక్‌అవుట్'

సూర్యుడి లోపలి అయస్కాంత క్షేత్రాల మధ్య ఏర్పడిన తీవ్రమైన ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు ఈ సౌరజ్వాలలు ఉద్గతమవుతాయి. ఫిబ్రవరి 1న చోటుచేసుకున్న భారీ పేలుడు ఇప్పటికే ప్రభావాలను చూపడం మొదలుపెట్టింది. దీనివల్ల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ప్రాంతాల్లో రేడియో సిగ్నల్స్ నిలిచిపోయి 'రేడియో బ్లాక్‌అవుట్' ఏర్పడింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఈ సౌర తుఫానులు భూమిని నేరుగా తాకితే, ఉపగ్రహాలు దెబ్బతినడం, మన నిత్య వినియోగంలో ఉన్న జీపీఎస్ (GPS) సిగ్నల్స్ పూర్తిగా తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది.

వివరాలు 

1859లో జరిగిన క్యారింగ్‌టన్ ఈవెంట్‌లో టెలిగ్రాఫ్ వైర్లకు మంటలు

ఇవికేవలం కమ్యూనికేషన్ వ్యవస్థలకే పరిమితం కాదు.సౌరతుఫానుల వల్ల వెలువడే 'కరోనల్ మాస్ ఈజెక్షన్'(CME)అనే ప్లాస్మా మేఘాలు భూమి చుట్టూ ఉన్న మాగ్నెటోస్పియర్‌ను ప్రభావితం చేస్తాయి. దీని ఫలితంగా పవర్ గ్రిడ్లలో ఒక్కసారిగా ఓవర్‌లోడ్ ఏర్పడి,భారీ ఎత్తున విద్యుత్ నిలిచే(Blackouts) అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 1859లో జరిగిన క్యారింగ్‌టన్ ఈవెంట్‌లో టెలిగ్రాఫ్ వైర్లకు మంటలు అంటుకున్న చరిత్ర ఉంది. నేటి ఆధునిక కాలంలో ఇలాంటి పరిస్థితి వచ్చినట్లయితే ఇంటర్నెట్ నుండి బ్యాంకింగ్ వరకు అన్ని డిజిటల్ వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకే నాసా (NASA),మన దేశపు ఇస్రో (ISRO)నిరంతరం సూర్యుడిని గమనిస్తూ ఉంటున్నాయి. సూర్యుడు తన 11ఏళ్ల చక్రంలో అత్యంత చురుకైన'సోలార్ మాక్సిమం'దశలోకి ప్రవేశిస్తున్నప్పుడు, మనం అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement