Sundar Pichai: పాపం ఉద్యోగులకు నిద్ర అవసరం : సుందర్ పిచాయ్
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ తాజాగా తన జెమిని ప్రో ప్లాన్ లో భాగంగా అప్‌డేట్ చేసిన జెమిని 3 (Gemini 3) మోడల్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఇతర ఏఐ కంపెనీలకు గూగుల్ గట్టి సవాల్ విసురుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఈఓ సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి. ఉద్యోగులు తగినంత నిద్ర తీసుకోవడం బాగా అవసరమని ఆయన సూచించారు.
వివరాలు
'గూగుల్ ఏఐ: రిలీజ్ నోట్స్' పాడ్‌కాస్ట్‌లో పిచాయ్
'గూగుల్ ఏఐ: రిలీజ్ నోట్స్' పేరుతో వచ్చిన పాడ్‌కాస్ట్‌లో పిచాయ్ మాట్లాడుతూ, జెమిని 3 లాంచ్‌కు ముందు కొన్ని వారాల పాటు తన టీం విరామం లేకుండా పనిచేసిందని తెలిపారు. ఈ కృషి వల్ల వారు తీవ్రమైన అలసటకు గురయ్యారని, కొందరికి నిజంగా నిద్ర చాలా అవసరమైన స్థితి వచ్చినట్లు అన్నారు. ఇప్పుడు అందరికీ సరైన విశ్రాంతి లభించే ఉంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
వివరాలు
జెమిని 3తో గూగుల్ మళ్లీ ఏఐ పోటీలో ముందుకు
గత నవంబర్ 18న గూగుల్ అత్యాధునిక ఏఐ మోడల్ జెమిని 3ను అధికారికంగా ప్రకటించింది. వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో గూగుల్ షేర్లు వేగంగా పెరిగి, కంపెనీ మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరువ అవుతోంది. ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ వంటి కంపెటేటర్ల నుండి కఠిన పోటీ ఎదురవుతున్న తరుణంలో, జెమిని 3తో గూగుల్ మళ్లీ ఏఐ పోటీలో ముందుకు వచ్చింది. ముఖ్యంగా వేగం, తార్కిక విశ్లేషణ సామర్థ్యం విషయంలో ఈ మోడల్ ప్రశంసలు అందుకుంటోంది.