
Sunitha Returns: అంతరిక్షం నుంచి సునీతా తిరుగు ప్రయాణం.. ఫిబ్రవరిలో రాకకు సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్ష ప్రయోగంలో భాగంగా సునీతా విలియమ్స్ టీమ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన విషయం తెలిసిందే.
ఆమె తిరిగి భూమికి రావడం ఆలస్యమవడంతో ఉత్కంఠ నెలకొంది.
అనేక సాంకేతిక సమస్యల కారణంగా ఆమె ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్ వాహక నౌక తమ లక్ష్యాన్ని చేరుకోలేదు.
నాసా, బోయింగ్ లు ఈ సమస్యలను సరిదిద్దేందుకు చాలా ప్రయత్నాలు చేసినా, పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు.
జూన్ 5న టేకాఫ్ అయిన స్టార్ లైనర్ వాహక నౌక ఐసీసీకి చేరుకుంది. కానీ టేకాఫ్ సమయంలోనే ప్రొపెల్షన్ సిస్టమ్ లో లీకులు, థ్రస్టర్స్ మూసుకుపోవడం వంటి సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి.
Details
రెస్క్యూ మిషన్ ను ప్రారంభించిన నాసా
ఆ తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఐసీసీకు చేరుకున్నారు.
తీరా భూమికి తిరిగి రావాల్సినప్పుడు ఈ వాహక నౌక ఆటోపైలెట్ మోడ్‌లో మాత్రమే తిరిగి వచ్చి, న్యూమెక్సికోలో ల్యాండ్ అయింది. దీంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఐసీసీలోనే ఉండిపోయారు.
ఐసీసీలో ఉన్న సునీతా టీమ్‌ను భూమికి తీసుకురావడం కోసం నాసా రెస్క్యూ మిషన్ ప్రారంభించింది.
2025 ఫిబ్రవరిలో ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి రానున్నారు. 8 రోజుల ప్రయాణం కోసం వెళ్లిన వాళ్లు, 8 నెలలు అక్కడే ఉండాల్సి వచ్చింది.