Apple AirPods : ఆపిల్ ఫ్యాన్స్‌కి సూపర్ అప్‌డేట్.. హైదరాబాద్‌లోనే ఎయిర్‌పాడ్స్ తయారీ!
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ ప్రియులకు ప్రముఖ టెక్ దిగ్గజం 'ఆపిల్' గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తి తప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
ఏప్రిల్ నుంచి ఎగుమతుల నిమిత్తం ఉత్పత్తిని ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
భారత్‌లో రెండో ప్రొడక్ట్ మేకింగ్
ఇప్పటికే ఐఫోన్ల తయారీలో ఉన్న ఆపిల్, ఇప్పుడు ఎయిర్‌పాడ్స్ ప్రొడక్షన్‌కూ శ్రీకారం చుట్టింది.
ఫాక్స్‌కాన్ హైదరాబాద్ ప్లాంట్‌లో ఈ ఉత్పత్తి ప్రారంభంకానుంది. అయితే ప్రస్తుతానికి ఇది ఎగుమతులకే పరిమితం కానుంది.
Details
భారీ పెట్టుబడులు
ఫాక్టరీ నిర్మాణం కోసం ఫాక్స్‌కాన్ 2023లో $400 మిలియన్ (రూ.3,500 కోట్లు) పెట్టుబడి పెట్టింది.
ప్రస్తుతం TWS (రియల్ వైర్‌లెస్ డివైజ్) విభాగంలో ఆపిల్ అగ్రగామిగా నిలిచింది.
కెనాలిస్ రిపోర్ట్ ప్రకారం 2024లో కంపెనీ 23.1% మార్కెట్ వాటాతో ముందుంది.
అమెరికా-భారత్ వాణిజ్య ప్రభావం
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాల విధానం ప్రకటించిన తర్వాత, ఆపిల్ వచ్చే నాలుగేళ్లలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడిని తమ తయారీ యూనిట్లలో పెట్టాలని నిర్ణయించింది.
దీంతో భారత ఉత్పత్తి మోదీ ప్రభుత్వంతో ప్రాధాన్యం పెంచుకుంటోంది.
Details
భారత ఎగుమతులపై ప్రభావం
ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ డేటా ప్రకారం, భారత్ హియరబుల్స్, వేరబుల్స్ దిగుమతిపై 20% సుంకం విధిస్తుంది.
అయితే అమెరికా ఇప్పటివరకు ఎలాంటి టారిఫ్ విధించలేదు. కానీ ట్రంప్ పరస్పర టారిఫ్ విధిస్తే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఎయిర్‌పాడ్స్‌పై 20% టారిఫ్ పడనుంది.
భారత్‌లో ఆపిల్ ఉత్పత్తికి పెరుగుతున్న ప్రాధాన్యత
భారత మార్కెట్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఆపిల్ హైదరాబాద్‌లో ఎయిర్‌పాడ్స్ తయారీ ప్రారంభించనుండటం కీలకమైన పరిణామం .
ఇది దేశీయ ఉత్పత్తికి కొత్త దారులు తెరిచే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.