Page Loader
UIDAI జారీ చేసే వివిధ రకాల ఆధార్ కార్డ్
వివిధ రకాల ఆధార్ కార్డులను జారీ చేసే UIDAI

UIDAI జారీ చేసే వివిధ రకాల ఆధార్ కార్డ్

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 18, 2023
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత విశిష్ట గుర్తింపు అథారిటీ UIDAI పౌరులకు వివిధ రకాల ఆధార్‌లను జారీ చేస్తుంది. వారి అవసరం ప్రకారం, PVC కార్డ్, eAadhaar, mAadhaar లేదా ఆధార్ లెటర్ ఎంచుకోవచ్చు. ఇవన్నీ గుర్తింపు రుజువుగా చెల్లుబాటు అవుతాయని UIDAI తెలిపింది. ఆధార్ లెటర్ అనేది UIDAI జారీ చేసిన పేపర్ ఆధారిత లామినేటెడ్ డాక్యుమెంట్. ఇది సురక్షితమైన QR కోడ్, జారీ చేసిన తేదీ, ముద్రణ తేదీతో పాటు కార్ హోల్డర్ జనాభా వివరాలను ఉంటాయి. UIDAI జారీ చేసిన ఆధార్ కార్డ్‌లో ఆధార్ PVC కార్డ్ కొత్త రకం. ఇది డిజిటల్‌గా సంతకం చేసిన QR కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, ఇష్యూ, ప్రింట్ తేదీ వంటి వాటితో వస్తుంది.

ఆధార్ కార్డ్

mAadhaar eAadhaar లాగానే ఆధార్ డిజిటల్ రూపం

eAadhaar UIDAIతో కేటాయించిన డిజిటల్, ఎలక్ట్రానిక్‌గా ధృవీకరించిన పత్రం. eAadhaar ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే (https://myaadhaar.uidai.gov.in/) లో myAadhaar పోర్టల్‌కి వెళ్లి, "Download Aadhaar"పై క్లిక్ చేయాలి. ఇప్పుడు, 12-అంకెల ఆధార్ నంబర్, 16-అంకెల వర్చువల్ ID లేదా 28-అంకెల ఎన్‌రోల్‌మెంట్ ID (EID)ని నమోదు చేయండి, క్యాప్చా కోడ్‌ను ఇచ్చాక "Send OTP" క్లిక్ చేయండి. OTPని సబ్మిట్ చేసి , ఆధార్‌ను డౌన్లోడ్ చేయండి. ఒకసారి, eAadhaar సిస్టమ్‌లో డౌన్‌లోడ్ అయ్యాక, ఎనిమిది అక్షరాల PDF పాస్‌వర్డ్‌ని ఉపయోగించి దానిని యాక్సెస్ చేయవచ్చు. mAadhaar అనేది eAadhaarలా ఆధార్ డిజిటల్ రూపం. గూగుల్ ప్లే స్టోర్ నుండి mAadhaar యాప్ ద్వారా మొబైల్ లో దీన్ని యాక్సెస్ చేయవచ్చు.