LOADING...
Elon Musk: 'భవిష్యత్ వినోదం పూర్తిగా AI ఆధారితమే'.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు 
'భవిష్యత్ వినోదం పూర్తిగా AI ఆధారితమే'.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

Elon Musk: 'భవిష్యత్ వినోదం పూర్తిగా AI ఆధారితమే'.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2025
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మళ్లీ మరోసారి వార్తల్లో నిలిచాడు. నిఖిల్‌ కమత్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో వచ్చిన 'Elon Musk: A Different Conversation' అనే రెండు గంటల ఇంటర్వ్యూలో మస్క్‌ పని, చైతన్యం, కుటుంబం, డబ్బు వంటి విభిన్న అంశాలపై మాట్లాడాడు. ఇందులో ముఖ్యంగా భవిష్యత్‌ మీడియా, కంటెంట్‌ క్రియేషన్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. భవిష్యత్‌లో మీడియా, సినిమాలు, పోడ్‌కాస్ట్‌లు వంటి వినోద రంగం మొత్తం AIపై ఆధారపడాల్సి వస్తుందని మస్క్‌ స్పష్టంచేశాడు. AI అభివృద్ధి బట్టి చూస్తే, కంటెంట్‌ సృష్టించే ప్రధాన శక్తి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సేనని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Details

రియల్‌టైమ్‌ వీడియో, గేమింగ్‌ రంగాల్లో AI విప్లవం 

రియల్‌టైమ్‌ వీడియో జనరేషన్‌, వీడియో గేమ్స్‌ రంగాలు AI ప్రభావంతో అత్యంత వేగంగా మారబోతున్నాయని మస్క్‌ చెప్పాడు. తన కంపెనీ 'xAI' అభివృద్ధి చేస్తున్న మోడళ్లతో పాటు ఇతర సంస్థల టూల్స్‌ కూడా మానవ అనుభవాలను అత్యంత నిజమైనట్లుగా ప్రతిబింబించగల సామర్థ్యం కలిగి ఉన్నాయన్నారు. వ్యక్తిత్వాలు, సూక్ష్మమైన భావాలు ఇవన్నింటినీ AI ఖచ్చితంగా అద్దంలా చూపగలదని ఆయన పేర్కొన్నాడు.

Details

డిజిటల్ యుగంలో లైవ్‌ ఈవెంట్ల విలువ పెరుగుతుంది 

ఇంటర్వ్యూలో నిఖిల్‌ కమత్‌ ప్రస్తావించిన లైవ్‌ ఈవెంట్ల కూడా మస్క్‌ స్పందించాడు. డిజిటల్‌ కంటెంట్‌ దాదాపు ఉచితంగా, విస్తృతంగా అందుబాటులోకి వస్తున్న సమయంలో మానవ సంబంధ అనుభూతిని ఇచ్చే లైవ్‌ ఈవెంట్లు అరుదై మరింత విలువైనవిగా మారతాయని ఆయన చెప్పారు. లైవ్‌ అనుభవాలు (కచేరీలు, స్పోర్ట్స్‌, స్టేజ్‌ ఈవెంట్లు) భవిష్యత్‌లో మంచి పెట్టుబడి అవకాశాలుగా మారవచ్చని కూడా మస్క్‌ అభిప్రాయపడ్డాడు.

Advertisement