Page Loader
Spotify: ప్రపంచ వ్యాప్తంగా 'స్పాటిఫై' ప్లే జాబితా లాంచ్
ప్రపంచ వ్యాప్తంగా 'స్పాటిఫై' ప్లే జాబితా లాంచ్

Spotify: ప్రపంచ వ్యాప్తంగా 'స్పాటిఫై' ప్లే జాబితా లాంచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 04, 2024
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్పాటిఫై తన వినూత్న ఫీచర్ 'డేలిస్ట్'ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక ప్లేజాబితా వినియోగదారుల అలవాట్లను ఆధారంగా చేసుకుని సంగీత అనుభవాన్ని అందించనుంది. గతేడాది ఇంగ్లీష్ మాట్లాడే మార్కెట్లలో ప్రారంభమైన ఈ ఫీచర్, ఇప్పుడు స్పాటిఫై నిర్వహించే అన్ని మార్కెట్లలో ఉచిత, ప్రీమియం వినియోగదారులకు అందుబాటులో ఉంది. డేలిస్ట్ 2023 సెప్టెంబర్‌లో మొదటిసారి యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ మార్కెట్లలో ప్రవేశపెట్టారు.

Details

65 దేశాలకు విస్తరించిన 'డేలిస్ట్'

2024 మార్చి నాటికి, ఈ ఫీచర్ అదనంగా 65 దేశాలకు విస్తరించింది. 70శాతం వినియోగదారులు వారానికోసారి తమ వ్యక్తిగతీకరించిన ప్లేజాబితాను వినడానికి తిరిగి వచ్చారని స్పాటిఫై నివేదించింది. స్పాటిఫై యాప్‌లో లేదా వెబ్‌లో "మీ కోసం రూపొందించబడింది" విభాగం ద్వారా డేలిస్ట్‌ను యాక్సెస్ చేయవచ్చు.