Loading...
SpaDex satellites: ముగిసిన స్పేడెక్స్ ఉపగ్రహాల ప్రస్థానం.. భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశం
ముగిసిన స్పేడెక్స్ ఉపగ్రహాల ప్రస్థానం.. భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశం

SpaDex satellites: ముగిసిన స్పేడెక్స్ ఉపగ్రహాల ప్రస్థానం.. భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2026
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)చేపట్టిన స్పేడెక్స్ ప్రయోగంలో భాగంగా అంతరిక్షంలోకి పంపిన రెండు ఉపగ్రహాలు తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించాయి. దీంతో దాదాపు 22నెలల పాటు సాగిన వాటి ప్రయాణం ముగిసింది.రోదసిలో రెండు వ్యోమనౌకలను అనుసంధానం చేసే సాంకేతికతను పరీక్షించేందుకు ఇస్రో 2024 డిసెంబరు 30న స్పేడెక్స్-ఎ, స్పేడెక్స్-బి ఉపగ్రహాలను ప్రయోగించింది. అనంతరం స్వయంప్రతిపత్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ రెండుఉపగ్రహాలను అంతరిక్షంలో విజయవంతంగా అనుసంధానం చేసింది. పరీక్షలు పూర్తయిన తర్వాత వాటిని తిరిగి విడదీసింది.ఈప్రయోగానికి నిర్దేశించిన అన్ని లక్ష్యాలనూ సాధించినట్లు ఇస్రో వెల్లడించింది. స్పేడెక్స్-ఎ ఉపగ్రహం ఈ నెల 12న దక్షిణ పసిఫిక్ మహాసముద్రం మీదుగా భూవాతావరణంలోకి ప్రవేశించింది. దీంతో స్పేడెక్స్ ప్రయోగంలో భాగంగా ఈ ఉపగ్రహాలు చేపట్టిన అంతరిక్ష ప్రయాణం ముగిసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భూవాతావరణంలోకి స్పేడెక్స్ ఉపగ్రహాలు.. 

ADVERTISEMENT