LOADING...
Surya Grahan : సూర్యగ్రహణం రోజున సూతక్ కాలం వర్తించదు.. భారతదేశంలో గ్రహణం కనిపిస్తుందా?
సూర్యగ్రహణం రోజున సూతక్ కాలం వర్తించదు.. భారతదేశంలో గ్రహణం కనిపిస్తుందా?

Surya Grahan : సూర్యగ్రహణం రోజున సూతక్ కాలం వర్తించదు.. భారతదేశంలో గ్రహణం కనిపిస్తుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2025
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

సెప్టెంబర్ ప్రారంభంలో సంపూర్ణ చంద్రగ్రహణం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఏడాదిలో రెండవ, చివరి 'సూర్యగ్రహణం' సంభవించనుంది. ఈ గ్రహణం కన్య రాశిలో చోటు చేసుకుంటోంది. సర్వ పితృ అమావాస్య రోజున వస్తుంది. హిందూ జ్యోతిషశాస్త్రాల ప్రకారం, సూర్యగ్రహణాన్ని అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరాదు.

Details

భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు 

భారత సమయం ప్రకారం, సూర్యగ్రహణం రాత్రి 11 గంటలకు ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున 3:23 గంటలకు ముగుస్తుంది. గరిష్ట గ్రహణ సమయం తెల్లవారుజామున 1:11 గంటలకు ఉంటుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించనందున సూతక కాలం వర్తించదు. కాబట్టి భారతదేశంలో మతపరమైన ఆచారాలపై ఎటువంటి పరిమితులు విధించబడవు. సర్వ పితృ అమావాస్య సందర్భంలో, రోహిణి ముహూర్తంలో పూర్వీకులకు నైవేద్యాలు, పూజలు నిర్వహించవచ్చు.

Details

అరుదైన యాదృచ్చికం - 122 సంవత్సరాల తర్వాత

జ్యోతిష్కుల ప్రకారం, ఈ గ్రహణం 122 సంవత్సరాల తర్వాతే జరగడం అరుదైన సందర్భం. ఇలాంటి యాదృచ్చికం 1903లో జరిగింది. ఆ సంవత్సరం అనేక ముఖ్య ఘటనలు చోటుచేసుకున్నాయి రాజు ఎడ్వర్డ్ VII, రాణి అలెగ్జాండ్రా పట్టాభిషేకం, బెంగాల్ విభజన ప్రణాళిక, భారత జాతీయ కాంగ్రెస్ మద్రాసులో సమావేశం. 2025లో కూడా ముఖ్యమైన పరిణామాలు ఉండే అవకాశాన్ని జ్యోతిష్కులు సూచిస్తున్నారు.

Details

సూర్యగ్రహణం రోజున పరిహారాలు

1. సూర్యగ్రహణ సమయంలో మంత్రాలను జపించండి 2. దేవుని నామాన్ని జపించండి 3. కీర్తనలు పాడండి 4. తాగే నీటిలో తులసి ఆకులను వేయండి ఈ సూచనలతో, సూర్యగ్రహణం సమయాన్ని పవిత్రంగా, శుభకరంగా గడపవచ్చు.