Earth Getting Brighter Each Year: ప్రతేడాది ప్రపంచం మరింత ప్రకాశవంతం.. కానీ కొన్ని ప్రాంతాల్లో విభిన్న మార్పులు!
ఈ వార్తాకథనం ఏంటి
భూమిపై కృత్రిమ వెలుగులు సంవత్సరానికొకసారి పెరుగుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ పెరుగుదల ఒకే విధంగా కాకుండా ప్రాంతాలవారీగా మారుతూ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాసా మద్దతుతో కనెక్టికట్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా వెలుగుల వినియోగంలో మార్పులను వెలికితీసింది.
వివరాలు
ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ
తొమ్మిదేళ్ల కాలంలో సేకరించిన 11 లక్షలకు పైగా ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు, 2014 నుంచి 2022 మధ్య భూమిపై కృత్రిమ వెలుగు 16% పెరిగిందని గుర్తించారు. ఇది 2017లో వెలువడిన అధ్యయనంతో కూడా సరిపోలుతుండగా, అప్పట్లో ప్రతేడాది సుమారు 2% చొప్పున వెలుగులు పెరుగుతున్నట్లు తేలింది. ప్రాంతాలవారీగా భిన్న ధోరణులు యూరప్‌లో విద్యుత్ వినియోగ నియంత్రణలు, ఎనర్జీ ఎఫిషియెన్సీ చర్యల వల్ల వెలుగు తగ్గింది వెనిజులాలో ఆర్థిక సంక్షోభం కారణంగా రాత్రి వెలుగులు 26% కంటే ఎక్కువగా తగ్గాయి ఆసియాలో, ముఖ్యంగా చైనా, ఉత్తర భారతదేశంలో పట్టణీకరణతో వెలుగులు భారీగా పెరిగాయి
వివరాలు
కోవిడ్, యుద్ధాల ప్రభావం
కోవిడ్-19 సమయంలో లాక్‌డౌన్లు, పరిశ్రమల మందగమనం, పర్యాటక రంగం తగ్గుదల వల్ల ప్రపంచవ్యాప్తంగా వెలుగులు తగ్గాయి. అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కూడా కొన్ని ప్రాంతాల్లో మార్పులొచ్చాయి. అమెరికాలో మిశ్రమ ధోరణి అమెరికాలో పశ్చిమ తీర నగరాలు జనాభా పెరుగుదలతో మరింత ప్రకాశవంతంగా మారగా, తూర్పు తీరంలో ఎనర్జీ-ఎఫిషియెంట్ LEDల వినియోగం వల్ల వెలుగు తగ్గింది.
వివరాలు
గ్యాస్ ఫ్లేరింగ్, ఆర్థిక కార్యకలాపాలు
ఉపగ్రహ చిత్రాల్లో టెక్సాస్‌లోని పెర్మియన్ బేసిన్, నార్త్ డకోటాలోని బక్కెన్ ప్రాంతాల్లో గ్యాస్ ఫ్లేరింగ్ కార్యకలాపాలు స్పష్టంగా కనిపించాయి. 'భూమి హార్ట్‌బీట్'లా మార్పులు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, భూమి నిరంతరం ప్రకాశవంతం అవుతూనే ఉండడం కాదు. మారుతున్న ఆర్థిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వెలుగులు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఈ మార్పులను "భూమి హార్ట్‌బీట్‌తో పోల్చారు.
వివరాలు
ప్రయోజనం ఏమిటి?
ఈ డేటా ద్వారా విద్యుత్ వినియోగాన్ని అంచనా వేయడం వ్యర్థాలను తగ్గించడం పర్యావరణ, ఆర్థిక భద్రతపై నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాల్లో సహాయం అందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.