Sunita Williams: భూమి చేరే తేదీపై స్పష్టత లేదు.. సునీతా విలియమ్స్ భావోద్వేగ వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ తన మూడో అంతరిక్ష ప్రయాణంలో దాదాపు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ఆమెతో పాటు వెళ్లిన బచ్ విల్మోర్ కూడా అక్కడే ఉన్నారు.
వీరిని భూమికి తిరిగి తీసుకురావడానికి గతంలో బైడెన్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని, దీంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ గతంలో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై సునీతా విలియమ్స్, విల్మోర్ స్పందించారు.
Details
ISS రిటైర్మెంట్ పై చర్చలు
భూమిపై తిరిగి రావడానికి స్పష్టమైన గడువు లేకపోవడం ఒక కఠిన పరిస్థితి అని సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రం నుండి మీడియాతో అన్నారు.
ISSలో తాము అనుకున్నదానికంటే ఎక్కువ కాలం ఉండిపోవడం వల్ల వచ్చే ఆందోళనలను తాము తప్పుబట్టకున్నా, భూమిపై ఉన్న వారి మనసుల్లో ఇది ప్రభావం చూపిస్తుందని విలియమ్స్, విల్మోర్ పేర్కొన్నారు.
నాసా, అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలు 2030లో ISS జీవితకాలం ముగియనుందని ప్రకటించాయి. ఆ సమయానికి దాన్ని కక్ష్య నుంచి వేరు చేయాలని నిర్ణయించారు.
అయితే అంతకు ముందే ISS రిటైర్మెంట్‌కు తీసుకురావాలని ఎలాన్ మస్క్ ఇటీవల సూచించారు.
దీనిపై స్పందించిన సునీతా విలియమ్స్, "ఇప్పుడే రిటైర్మెంట్‌కు సరైన సమయం కాదు, ISS ఇంకా అత్యున్నత స్థాయిలో ఉందని అభిప్రాయపడ్డారు.
Details
బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందా?
ISSలో చిక్కుకున్న తమను అమెరికా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలపై బచ్ విల్మోర్ స్పందించారు.
ఇది పూర్తిగా రాజకీయ అంశమని, ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యం లేదన్నారు. తమకు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ పట్ల గౌరవం ఉందని చెప్పారు.
స్టార్‌లైనర్ మిషన్‌లో సాంకేతిక సమస్యలు
2024 జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక 'స్టార్‌లైనర్' ద్వారా సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లు ISSకు చేరుకున్నారు.
ప్రణాళిక ప్రకారం వారిని వారం రోజుల వ్యవధిలో భూమికి తిరిగి పంపించాలని నిర్ణయించారు.
అయితే స్టార్‌లైనర్‌లో అనుకోని సాంకేతిక లోపాలు తలెత్తడంతో వ్యోమనౌకను వ్యోమగాములు లేకుండానే భూమికి తీసుకురావాల్సి వచ్చింది. దీంతో సునీతా విలియమ్స్, విల్మోర్ ISSలోనే ఉండిపోయారు.
Details
నాసా, స్పేస్ ఎక్స్ ప్రణాళిక
ఈ ఇద్దరు వ్యోమగాములను భూమికి తిరిగి తీసుకురావడానికి ముందుగా మరికొందరిని ISSకు పంపించాల్సిన అవసరం ఉందని నాసా పేర్కొంది.
ఈ మిషన్ నిర్వహించడానికి స్పేస్‌ఎక్స్‌కు కొంత సమయం అవసరమవడంతో ఆలస్యం జరిగిందని అధికారులు వెల్లడించారు.
కొన్నిరోజుల క్రితం ఐఎస్ఎస్ నుంచి సునీతా విలియమ్స్, విల్మోర్ మీడియాతో మాట్లాడారు. మార్చి 12న స్పేస్‌ఎక్స్ క్రూ-10 వ్యోమనౌక ISSకు చేరుకోవాలని భావిస్తున్నారు.
నూతనంగా వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మార్చి 19న సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ స్పేస్‌ఎక్స్ నౌక ద్వారా భూమికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు.