iPhone: ఐఫోన్‌కు ఈ 5 కొత్త ఉపగ్రహ ఫీచర్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ కంపెనీ తన ఐఫోన్‌ల కోసం కొత్త ఉపగ్రహ (Satellite) కనెక్టివిటీ ఫీచర్లను తీసుకురావడానికి పనిచేస్తోందని బ్లూమ్‌బర్గ్ జర్నలిస్ట్ మార్క్ గర్మన్ వెల్లడించారు. ఈ క్రమంలో, థర్డ్ పార్టీ యాప్ డెవలపర్లు కూడా తమ యాప్‌ల్లో ఉపగ్రహ సేవలను ఉపయోగించుకునేలా ప్రత్యేక API (అప్లికేషన్ ఇంటర్‌ఫేస్)ను తయారు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది యాప్ డెవలపర్ల ఇష్టం, వారి సౌకర్యం మీద ఆధారపడి ఉంటుంది. అన్నీ యాప్‌లు ఒకేసారి ఈ ఫీచర్‌ను సపోర్ట్ చేసే అవకాశం లేదు.
వివరాలు
ఆపిల్ మ్యాప్స్, శాటిలైట్ మెసేజింగ్‌లో మెరుగులు
శాటిలైట్ నెట్‌వర్క్‌ను ఆపిల్ మ్యాప్స్‌తో కలిపి, ఇకపై సిమ్ లేకపోయినా, నెట్ లేకపోయినా, వినియోగదారులు మార్గదర్శనం (Navigation) పొందేలా ఆపిల్ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే టెక్స్ట్ మెసేజ్‌లకే పరిమితమైన శాటిలైట్ మెసేజింగ్‌లో కూడా మార్పులు చేయనుంది. తద్వారా ఫోటోలు కూడా పంపే అవకాశం రావచ్చని తెలుస్తోంది. ఇవన్నీ ఐఫోన్ 14 నుండి అందుబాటులో ఉన్న అత్యవసర శాటిలైట్ సేవల విస్తరణగా భావిస్తున్నారు.
వివరాలు
ఇండోర్ సిగ్నల్, 5G NTN సపోర్ట్
మరిన్ని ముఖ్యమైన మార్పుల్లో ఒకటి — ఇంటి లోపల, కారులో లేదా జేబులో ఉన్నా కూడా ఐఫోన్‌కు శాటిలైట్ సిగ్నల్ అందేలా మెరుగులు చేయడం. అలాగే, ఐఫోన్ 18 సిరీస్ నుంచి 5G NTN (Non-Terrestrial Networks) సపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల మొబైల్ టవర్స్ నేరుగా శాటిలైట్‌లతో కలసి, విస్తృత కవరేజ్ అందిస్తాయి.
వివరాలు
Globalstar ను SpaceX కొనుగోలు చేసే అవకాశం
ప్రస్తుతం ఆపిల్, Globalstar ఉపగ్రహ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తోంది. కానీ ఇదే Globalstar కంపెనీని ఎలన్ మస్క్‌కు చెందిన SpaceX కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త శాటిలైట్ ఫీచర్ల కోసం Globalstar నెట్‌వర్క్‌ను పెద్ద ఎత్తున అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. అందుకే SpaceX డీల్ జరిగితే సేవలు త్వరగా విస్తరించే అవకాశం ఉంది. ప్రాథమిక ఫీచర్లు ఉచితంగా, అధునాతన సేవలు మాత్రం చార్జ్‌తో అందించే ఆలోచన ఉందట.
వివరాలు
ఆపిల్ స్వంత శాటిలైట్ సేవ?
ఆపిల్ తన సొంత శాటిలైట్ సర్వీస్ ప్రారంభించాలని కూడా అంతర్గతంగా చర్చలు జరిగాయి. కానీ టెలికాం కంపెనీలా వ్యవహరించాల్సి వస్తుందని భావించి ఇప్పటివరకు ఆ ఆలోచనను నిలిపేశారు. ప్రస్తుతం ఆపిల్ శాటిలైట్ ద్వారా ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ లేదా ఇంటర్నెట్ బ్రౌజింగ్ సేవలు అందించే ప్రణాళికలు మాత్రం లేవు.